సోషల్ మీడియాలోనే తెలుగు తమ్ముళ్ల ఆరాటం..!

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బాటలోనే తెలుగు తమ్ముళ్లు నడుస్తున్నారు. కరోనా సమయంలో బాబు ఏపీలో కంటే హైదరాబాద్లోనే ఎక్కువగా ఉంటున్నారు. అప్పుడప్పుడు అమరావతికి వచ్చి పోతున్నారు. అయినప్పటికీ నేరుగా పార్టీ నేతలను కలుసుకుని సమీక్షలు, సమావేశాలు పెట్టిన దాఖలు ఇటీవలీ కాలంలో చాలా అరుదనే చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు ఇప్పుడంతా సోషల్ మీడియాలోనే రాజకీయం చేస్తున్నారు. సీఎం జగన్ కు బాలయ్య జై కొడతారా? తాజాగా ఏపీలో నిర్వహించిన మహానాడు కార్యక్రమం కూడా జూమ్ యాప్ […]

Written By: Neelambaram, Updated On : July 18, 2020 3:06 pm
Follow us on


టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బాటలోనే తెలుగు తమ్ముళ్లు నడుస్తున్నారు. కరోనా సమయంలో బాబు ఏపీలో కంటే హైదరాబాద్లోనే ఎక్కువగా ఉంటున్నారు. అప్పుడప్పుడు అమరావతికి వచ్చి పోతున్నారు. అయినప్పటికీ నేరుగా పార్టీ నేతలను కలుసుకుని సమీక్షలు, సమావేశాలు పెట్టిన దాఖలు ఇటీవలీ కాలంలో చాలా అరుదనే చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు ఇప్పుడంతా సోషల్ మీడియాలోనే రాజకీయం చేస్తున్నారు.

సీఎం జగన్ కు బాలయ్య జై కొడతారా?

తాజాగా ఏపీలో నిర్వహించిన మహానాడు కార్యక్రమం కూడా జూమ్ యాప్ ద్వారానే నిర్వహించి హైటెక్ బాబు అనిపించుకున్నారు. సోషల్ మీడియా ద్వారానే తమ్ముళ్లకు టచ్లో ఉంటూ దిశానిర్దేశం చేస్తున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు కూడా ఆయన బాటలోనే వెళుతున్నారు. ప్రజా క్షేత్రంలో పోరాటాలను మానేసి సోషల్ మీడియా బాటపడుతున్నారు. ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేస్తే బాబు దృష్టిలో పడే అవకాశం తక్కువేనని.. అదే సోషల్ మీడియాలో జగన్ ను టార్గెట్ చేయడం ద్వారా బాబు దృష్టిలో పడే అవకాశం ఎక్కువగా ఉందని తెలుగు తమ్ముళ్లు గుర్తించినట్లు ఉన్నారు. దీంతో నేతలంతా ఇదేమార్గాన్ని అనుసరిస్తున్నారు.

కొద్దిరోజులుగా తెలుగు తమ్ముళ్లు మీడియా సమావేశాల కంటే.. సోషల్ మీడియాకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. సోషల్ మీడియాలోనే రాజకీయాలను హిటెక్కిస్తున్నారు. సీఎం జగన్ పై తీవ్రంగా విమర్శలు చేయడం ద్వారా బాబులో దృష్టిలో పడేందుకు ప్లాన్ చేస్తున్నారు. పార్టీ ఇప్పుడు అధికారంలో లేకపోయినా భవిష్యత్తులో ఏదైనా పదవీ దక్కుతుందనే ఆశతో టీడీపీ నేతలు ఉన్నారు. దీంతో బాబు దృష్టిలో పడేందుకు తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియానే వారధిగా మలుచుకుంటున్నారు.

చినబాబుకు బ్యాడ్ లక్.. అవకాశం మిస్సయిందా?

ఇప్పటివరకు సోషల్ మీడియా అకౌంట్లు లేనివారు కొత్తగా అకౌంట్లు ఓపెన్ చేసి సోషల్ మీడియాపై అవగాహన పెంచుకున్నారు. చంద్రబాబు తనయుడు లోకేష్ బాబు కూడా సోషల్ మీడియాలోనే యాక్టివ్ ఉంటున్నారు. చినబాబు కూడా ట్వీటర్లోనే జగన్ సర్కార్ పై సెటైర్లు వేస్తూ రాజకీయం చేస్తుండటాన్ని గుర్తు చేసుకుంటున్నారు. దీంతో తెలుగు తమ్ముళ్లంతా చంద్రబాబు, లోకేష్ బాబు రూట్లోనే వెళుతున్నారు. అయితే ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ప్రజాక్షేత్రంలో లేకుండా సోషల్ మీడియాను మాత్రమే నమ్ముకోవడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.