ఏపీ సీఎం జగన్ సంచలనం సృష్టించారు. కృష్ణా జల వివాదం నేపథ్యంలో.. జగన్ మౌనంగా ఉంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా జలవివాదం నేపథ్యంలో నీటిని అనవసరంగా వృథా చేస్తున్న తెలంగాణ తీరును తప్పుపడుతూ సీఎం జగన్ ఏకంగా ప్రధానమంత్రి మోడీకి, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కు లేఖ రాయడం చర్చనీయాంశమైంది.
తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తికి ఏకపక్షంగా నీటిని వినియోగిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఏపీ ప్రయోజనాలు దెబ్బతినేలా తెలంగాణ వ్యవహరిస్తోందని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలను ఉల్లంఘించిందని జగన్ ఆక్షేపించారు.
శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో ఏకపక్షంగా విద్యుదుత్పత్తి కోసం నీటిని వినియోగిస్తున్నారని తెలిపారు. జల వివాదాల విషయంలో ప్రధాని మంత్రి జోక్యం చేసుకోవాలని కోరారు.
ఈ క్రమంలోనే ప్రాజెక్టులపై జాతీయ భద్రతా దళాలైన సీఐఎస్ఎఫ్ బలగాలను మోహరించాలని జగన్ విజ్ఞప్తి చేశారు. నీటి వినియోగం, జలాల పంపకాల విషయంలో కేఆర్ఎంబీ పరిధిని నిర్ధేశించాలని ప్రధానిని కోరారు.
జగన్ లేఖకు కేంద్రం స్పందిస్తుందా? ప్రాజెక్టులపై కేంద్రబలగాలను మోహరిస్తుందా? తెలంగాణను కట్టడి చేస్తుందా? అన్న దానిపై త్వరలోనే తేలనుంది.