https://oktelugu.com/

టాలీవుడ్ ప్రముఖుల డ్రగ్స్ కేసు అనూహ్య మలుపు

ఎడతెగని ఆ డ్రగ్స్ కేసులో ఇప్పటికీ సినీ ప్రముఖులు ఎవ్వరూ అరెస్ట్ కాలేదు. కేవలం విచారణ పేరుతో హడావుడి చేసిన తెలంగాణ ప్రభుత్వం సినీ ప్రముఖుల నుంచి ఒత్తిడి.. టాలీవుడ్ కు హైదరాబాద్ యే గమ్యస్థానం కావడంతో ఎక్కడా ఎవ్వరినీ టచ్ చేసే సాహసం చేయలేదు. దీంతో ఆ కేసు నీరుగారిపోయిందన్న ప్రచారం సాగుతోంది. టాలీవుడ్ ప్రముఖుల డ్రగ్స్ కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ డ్రగ్స్ కేసులో తాజాగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఎఫ్ఐఆర్ దాఖలు […]

Written By:
  • NARESH
  • , Updated On : July 1, 2021 / 08:56 PM IST
    Follow us on

    ఎడతెగని ఆ డ్రగ్స్ కేసులో ఇప్పటికీ సినీ ప్రముఖులు ఎవ్వరూ అరెస్ట్ కాలేదు. కేవలం విచారణ పేరుతో హడావుడి చేసిన తెలంగాణ ప్రభుత్వం సినీ ప్రముఖుల నుంచి ఒత్తిడి.. టాలీవుడ్ కు హైదరాబాద్ యే గమ్యస్థానం కావడంతో ఎక్కడా ఎవ్వరినీ టచ్ చేసే సాహసం చేయలేదు. దీంతో ఆ కేసు నీరుగారిపోయిందన్న ప్రచారం సాగుతోంది.

    టాలీవుడ్ ప్రముఖుల డ్రగ్స్ కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ డ్రగ్స్ కేసులో తాజాగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఈ అభియోగ పత్రాలను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. దీంతో నాలుగేళ్ల తర్వాత ఈ కేసు విచారణ మొదలు కానుంది. వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన అబ్కారీ శాఖ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అభియోగ పత్రాలను దాఖలు చేయగా వాటిని న్యాయస్థానం ఆమోదించింది.

    2017 జూలై 2న ఈ డ్రగ్స్ కేసు బయటపడింది. ఎక్సైజ్ శాఖ అధికారులు నగరానికి చెందిన కెల్విన్ మాస్కెరాన్స్, అబ్దుల్ వహాబ్, అబ్దుల్ ఖుద్దూస్ ను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.30 లక్షల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో టాలీవుడ్ సినీ ప్రముఖులు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, విద్యార్థులకు మత్తు పదార్థాలు సరఫరాచేస్తున్నట్టు విచారణలో నిందితులు వెల్లడించారు. దీనిపై విచారణకు సిట్ ఏర్పాటు చేయగా.. మూడేళ్లకు కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

    కేసు నమోదై ఏళ్లు గడుస్తున్నా దర్యాప్తులో జాప్యంపై విమర్శలు వినిపించాయి. విచారణకు హాజరైన సినీ ప్రముఖులు ఎవ్వరిని కూడా ఈ కేసులో ఇన్ వాల్వ్ చేయకపోవడంతో కేసు నీరుగారిపోయినట్టుగా ప్రచారం సాగుతోంది.