https://oktelugu.com/

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్

జగన్ సర్కార్ రైతులకు మరో తీపి కబురు చెప్పింది. ఇప్పటికే రైతుల కోసం సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన అమలు చేస్తున్నారు. తాజాగా రైతులు వేసిన ఖరీఫ్ పంటలకు సైతం జగన్ సర్కార్ ఉచిత బీమా అమలు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై రైతుల నుంచి సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. Also Read: మరో రెండ్రోజులు అసెంబ్లీ.. అందుకోసమే..! ప్రస్తుతం సాగులో ఉన్న ఖరీఫ్ పంటలకు ప్రభుత్వం వాతావరణ ఆధారిత బీమా […]

Written By:
  • NARESH
  • , Updated On : October 9, 2020 1:56 pm
    Follow us on


    జగన్ సర్కార్ రైతులకు మరో తీపి కబురు చెప్పింది. ఇప్పటికే రైతుల కోసం సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన అమలు చేస్తున్నారు. తాజాగా రైతులు వేసిన ఖరీఫ్ పంటలకు సైతం జగన్ సర్కార్ ఉచిత బీమా అమలు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై రైతుల నుంచి సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

    Also Read: మరో రెండ్రోజులు అసెంబ్లీ.. అందుకోసమే..!

    ప్రస్తుతం సాగులో ఉన్న ఖరీఫ్ పంటలకు ప్రభుత్వం వాతావరణ ఆధారిత బీమా చేయించింది. ఇందుకోసం రూ.101 కోట్ల వాటా ధనాన్ని జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఏపీజీఐసీఎల్‌) విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈమేరకు కొన్ని నిబంధనలు పూర్తి కావాల్సి ఉంది. ఇక గతేడాది గుర్తించిన వ్యవసాయ, ఉద్యానన పంటలకు కూడా ఏపీజీఐసీఎల్ బీమా అమలు చేస్తోంది.

    ఈ-పంటలో నమోదు చేసుకున్న పంటలకు మాత్రమే ఈ ఉచిత బీమా వర్తించనుంది. దీంతో రైతులకు తమ పంట వివరాలను ఈ-పంటలో నమోదు చేసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈమేరకు ప్రభుత్వం రాష్ట్రంలో ఏయే జిల్లాల్లో ఏయే పంటలకు దిగుబడి, వాతావరణ ఆధారిత బీమాను అమలు చేయాలో జాబితాలను విడుదల చేసింది.

    Also Read: జగన్‌ నిర్ణయం.. ఏపీకి నష్టం.. తెలంగాణకు ఆదాయం..!

    ఈ-పంటలో వివరాలను నమోదు చేసుకున్న వారికి జనరల్‌ క్రాప్‌ ఎస్టిమేషన్‌ సర్వే(జీసీఈఎస్‌) ఆధ్వర్యంలో బీమా క్లెయిమ్స్‌ సమస్యలు పరిష్కరించనున్నారు. వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద క్లెయిమ్స్‌ను ఏపీఎస్‌డీపీఎస్‌గానీ.. లేదా గుర్తించిన ఐఎండీ వాతావరణ కేంద్రాలుగానీ.. రాష్ట్ర ప్రభుత్వ మండలస్థాయి రెయిన్‌ గేజ్‌ స్టేషన్లుగానీ ఇచ్చే సమాచారం ఆధారంగా బీమా క్లయిమ్స్ రైతులకు చెల్లిస్తారు. తాజాగా జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.