https://oktelugu.com/

ఐపీఎల్ లో ఆ జట్టు కథ ముగిసినట్టేనా?

  ఐపీఎల్‌ మ్యాచ్‌లు రోజురోజుకూ ఆసక్తికరంగా నడుస్తున్నాయి. చివరి ఓవర్‌‌ వరకూ ఉత్కంఠను తెచ్చిపెడుతున్నాయి. ఇండియాలో జరగాల్సిన టోర్నీ కరోనా కారణంగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు తరలిపోయింది. దుబాయి వేదికగా నడుస్తున్న ఈ మ్యాచ్‌ల్లో కేఎల్‌ రాహుల్‌ సారథ్యం వహిస్తున్న కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు కథ ముగిసినట్లే కనిపిస్తోంది. Also Read: ఐపీఎల్ జట్లలో ఆటగాళ్లు మారిపోనున్నారా? ప్లేఆఫ్ ద్వారాలు కూడా మూసుకుపోయాయనే చెప్పాలి. ఎమిరేట్స్ నుంచి స్వదేశానికి విమానం ఎక్కబోయే తొలి జట్టు అదే […]

Written By:
  • NARESH
  • , Updated On : October 9, 2020 / 01:27 PM IST
    Follow us on

     

    ఐపీఎల్‌ మ్యాచ్‌లు రోజురోజుకూ ఆసక్తికరంగా నడుస్తున్నాయి. చివరి ఓవర్‌‌ వరకూ ఉత్కంఠను తెచ్చిపెడుతున్నాయి. ఇండియాలో జరగాల్సిన టోర్నీ కరోనా కారణంగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు తరలిపోయింది. దుబాయి వేదికగా నడుస్తున్న ఈ మ్యాచ్‌ల్లో కేఎల్‌ రాహుల్‌ సారథ్యం వహిస్తున్న కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు కథ ముగిసినట్లే కనిపిస్తోంది.

    Also Read: ఐపీఎల్ జట్లలో ఆటగాళ్లు మారిపోనున్నారా?

    ప్లేఆఫ్ ద్వారాలు కూడా మూసుకుపోయాయనే చెప్పాలి. ఎమిరేట్స్ నుంచి స్వదేశానికి విమానం ఎక్కబోయే తొలి జట్టు అదే కానున్నట్లు తెలుస్తోంది. ఎప్పట్లాగే.. ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ తన పరాజయాలను కొనసాగిస్తోంది. కెప్టెన్ మారినా ఆ జట్టు తలరాత మారలేదనిపిస్తోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో 69 పరుగుల తేడాతో ఓడింది. టోర్నమెంట్‌లో ముందుకెళ్లే అవకాశాలను దాదాపుగా మూసిపోయినట్లే కనిపిస్తోంది.

    దుబాయ్ ఇంటర్నేషన్ స్టేడియంలో గురువారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ టీమ్ పోరాడలేక చేతులెత్తేసింది. పంజాబ్ టీమ్‌లో నికొలస్ పూరన్ ఒకే ఒక్కడు హైదరాబాద్ బౌలర్లకు ఎదురొడ్డి నిలిచాడు. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ వంటి హార్డ్ హిట్టర్లు భారీ స్కోరును సాధించలేకపోయారు. సన్ రైజర్స్ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. దాని దరిదాపులకు కూడా చేరుకోలేకపోయింది పంజాబ్.

    Also Read: ధోనీ టీంకు ఏమైంది..?

    ఇప్పటిదాకా ఈ సీజన్‌లో కింగ్స్ పంజాబ్ ఆరు మ్యాచ్‌లను ఆడగా.. ఒకే ఒక్క విజయాన్ని నమోదు చేసింది. పాయింట్ల పట్టికలోనూ అట్టడుగు స్థాయిలో ఉంది. ఇక అక్కడి నుంచి పైకి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. అయిదు మ్యాచుల ఓటమితో రన్‌రేట్ దారుణంగా ఉంది. మైనస్ 0.431లోకి పడిపోయింది. ప్రస్తుతం ఎనిమిది జట్లు ఆడుతుండగా ఆరు జట్లు మాత్రమే ప్లేఆఫ్‌లో ఆడే అవకాశం ఉంది. పాయింట్ల పట్టికలో అట్టుడుగున ఉన్న పంజాబ్ కింగ్స్ ఒక్క మ్యాచ్‌లోనే గెలుపొందగా.. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ రెండేసి విజయాలను అందుకున్నాయి. ఈ టోర్నమెంట్‌లో పంజాబ్ ఇంకా తొమ్మిది మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. అంటే.. కనీసం ఆరు మ్యాచ్‌లల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. ఏడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లల్లో విజయాన్ని అందుకోగలిగితేనే పంజాబ్ ఈ టోర్నమెంట్‌లో చివరికంటా ఉంటుంది. మరి ఇప్పటికే ఇన్ని మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన జట్టుకు ఈ తొమ్మిదింట్లో ఆరు మ్యాచ్‌లను గెలిచే అవకాశం ఉందా?