https://oktelugu.com/

వచ్చే ఎన్నికల్లో బీజేపీ కొత్త కూటమి!

తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు హీటెక్కాయి. ప్రధాన పార్టీలేమో పొత్తుపైనే ప్రధానంగా దృష్టిసారించాయి. ఏ ఎన్నికల్లోనైనా పార్టీలు పొత్తులు పెట్టుకొని అధికారం చేపట్టాలని ఆలోచిస్తుంటాయి. తమిళనాడులోనూ ఈ రాజకీయం చాలా కాలంగా సాగుతోంది. అయితే.. ప్రతి ఎన్నికల్లోనూ అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల నేతృత్వంలోనే ప్రధానమైన కూటములు ఏర్పాటు కావడం ఆనవాయితీగా నడుస్తోంది. Also Read: టీఆర్పీల్లోనూ అక్రమాలు: టీవీ చానెళ్ల మాయ బయటపడిందా? ఈ నేపథ్యంలో జాతీయ పార్టీ బీజేపీ అసెంబ్లీ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 9, 2020 / 01:13 PM IST
    Follow us on

    తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు హీటెక్కాయి. ప్రధాన పార్టీలేమో పొత్తుపైనే ప్రధానంగా దృష్టిసారించాయి. ఏ ఎన్నికల్లోనైనా పార్టీలు పొత్తులు పెట్టుకొని అధికారం చేపట్టాలని ఆలోచిస్తుంటాయి. తమిళనాడులోనూ ఈ రాజకీయం చాలా కాలంగా సాగుతోంది. అయితే.. ప్రతి ఎన్నికల్లోనూ అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల నేతృత్వంలోనే ప్రధానమైన కూటములు ఏర్పాటు కావడం ఆనవాయితీగా నడుస్తోంది.

    Also Read: టీఆర్పీల్లోనూ అక్రమాలు: టీవీ చానెళ్ల మాయ బయటపడిందా?

    ఈ నేపథ్యంలో జాతీయ పార్టీ బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త కూటమిలో చేరటానికి సమయాత్తమవుతోందట. అన్నాడీఎంకే కూటమి నుంచి వైదొలిగేందుకు వ్యూహరచనలు సాగిస్తోంది. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు ఎల్‌.మురుగన్‌, ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పొన్‌రాధాకృష్ణన్‌ రెండు రోజులుగా మీడియా సమావేశంలో చేసిన ప్రకటనలు ఇందుకు బలన్ని చేకూరుస్తున్నాయి.

    అన్నాడీఎంకేలో సీఎం అభ్యర్థి ఎవరనే విషయమై 50 రోజులకు పైగా వివాదాలు సాగాయి. చివరికి ముఖ్యమంత్రి పళనిస్వామిని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం డిమాండ్‌ మేరకు 11 మందితో పార్టీలో మార్గదర్శక కమిటీని ఏర్పాటు చేయడంతో ఆ పార్టీలో విభేదాలు సమసిపోయాయి. దీనిపై పొన్‌ రాధాకృష్ణన్‌ మాట్లాడుతూ అధికార అన్నాడీఎంకేలో చెలరేగిన వివాదాలు సమసిపోవడాన్ని స్వాగతిస్తున్నానన్నారు. బీజేపీకి సంబంధించినంత వరకూ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి ఏ పార్టీని ఎదిరించాలనే విషయాలపై స్పష్టమైన వైఖరి అవలంబిస్తామన్నారు. ప్రస్తుతానికి బీజేపీ అన్నాడీఎంకే కూటమిలోనే కొనసాగుతుందని, ఈ కూటమి లోక్‌సభ, స్థానిక సంస్థలు, అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల వరకు సవ్యంగా సాగిందన్నారు. ఎన్నికల సమయంలో ఏ పార్టీ అయినా తమ నాయకత్వంలోనూ కూటమి ఏర్పాటు కావాలని ఆశిస్తుందని, ఆ దిశగానే పార్టీ శ్రేణులంతా శ్రమిస్తారన్నారు.

    అయితే.. మరో ఏడాదిలో జరుగనున్న ఈ ఎన్నికల్లో ఈసారి కూటముల్లో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ పార్టీతో పొత్తుపెట్టుకోవాలన్న విషయంపై బీజేపీనీ ఏ పార్టీలూ కట్టడి చేయలేవని పొన్‌రాధాకృష్ణన్‌ కూడా స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికార అన్నాడీఎంకేతోగాని, ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకేతోగానీ పొత్తుపెట్టుకునే అవకాశాలున్నాయని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తమ పార్టీ అధిష్టానం ఏ పార్టీతో పొత్తుపెట్టుకోవాలో నిర్ణయం తీసుకుంటుందన్నారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పార్టీని అధికారికంగా ప్రారంభించిన తర్వాత ఆ పార్టీ ఆశయాలు తెలుసుకుని ఆ పార్టీతో పొత్తుపెట్టుకోవాలా వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. మొత్తంగా బీజేపీ భాగస్వామ్యంతోనే వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తుందంటూ జోస్యం చెబుతున్నారు.

    Also Read: అనిల్ అంబానీ జైలుకు పోకుండా ముఖేష్ అంబానీ సాయం చేయలేదా?

    ఈ పొత్తులపై మురుగన్‌ కూడా స్పందించారు. పొన్‌ రాధాకృష్ణన్‌ చెప్పినట్లుగానే కూటమిలో మార్పులు జరుగుతాయని చెప్పారు. ఎన్నికల సమయంలో పార్టీలు కొత్త కూటముల్లో చేరడం సర్వసాధారణమన్నారు. అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగానే ఉందని, అదే సమయంలో తమ పార్టీ కొత్త కూటమిలో చేరే అవకాశాలు లేకపోలేదని తెలిపారు. వీటి నేపథ్యంలో బీజేపీ ఒకవేళ అన్నాడీఎంకే నుంచి వైదొలిగి కొత్త కూటమికి స్వాగతం చెబితే రాజకీయాల్లో పెను మార్పులే సంభవిస్తాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.