Telangana Politics: తెలంగాణలో రాజకీయాలు మారుతున్నాయి. పార్టీల్లో వ్యూహాలు ఖరారు చేసుకుంటున్నాయి. అధికారం కోసం అన్ని మార్గాలు అన్వేషిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య అగాధం పెరిగిపోతోంది. దీంతో రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన పద్ధతులను గురించి చర్చిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ రెండు కూడా తమ లక్ష్యం నెరవేర్చుకోవాలనే చూస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ను టీఆర్ఎస్ తన ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకునేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీలో అప్పుడే భయం నెలకొందని సమాచారం.

బెంగాల్ లో మమతా బెనర్జీని సీఎం గా చేసేందుకు తన శాయిశక్తులా పనిచేసిన పీకేను కేసీఆర్ తన పార్టీని మరోమారు అధికారంలో కూర్చోబెట్టాలని ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పీకే తన వ్యూహాలకు పదును పెడుతున్నట్లు చెబుతున్నారు. ఇదే జరిగితే ఇన్నాళ్లు బీజేపీకి ఎదురులేదని చెబుతున్నా పీకే రాకతో పరిస్థితిలో మార్పు వస్తుందని భయపడుతున్నారు. అతడు మాట ఇస్తే పార్టీని కచ్చితంగా అధికారంలో కూర్చోబెట్టే వరకు విశ్రమించడని చెబుతున్నారు.
Also Read: శశికళతో విజయశాంతి భేటీ.. రాజకీయమా.. మరోకోణమా?
ప్రస్తుతం బీజేపీలో పీకే భయం వెంటాడుతోందని తెలుస్తోంది. తెలంగాణలో పీకే వస్తే బీజేపీకి అధికారం అందని ద్రాక్షే అనే విషయం ప్రచారంలో సాగుతోంది. దీనికి సరైన సమఉజ్జీని రంగంలోకి దిగాలని ఆలోచిస్తోంది. బీజేపీ నిర్ణయంతో టీఆర్ఎస్ ను ఎంత మేరకు నిలువరిస్తుందో చూడాల్సిందే. దీంతో తెలంగాణలో మరోమారు అధికారం కోసం టీఆర్ఎస్, ఒక్కసారైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ఆలోచిస్తోంది. ఈ క్రమంలో రాజకీయ పరిణామాలు ఎటు వైపు దారితీస్తాయో తెలియడం లేదు.
టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ చెబుతోంది. కానీ టీఆర్ఎస్ మాత్రం తన కోరిక తీర్చుకునేందుకు సిద్ధమవుతోంది. ఇక తామే దిక్కని బీజేపీ సూచిస్తున్నా టీఆర్ఎస్ కూడా తామే మరోమారు అధికారంలోకి వస్తుందని ఆశిస్తోంది. రాష్ట్రంలో రెండు పార్టీల్లో పరిణామాలతో ఇంకా ఏం మార్పులు వస్తాయో తెలియడం లేదు.
Also Read: ఆన్ లైన్ క్లాసులపై హైకోర్టు కీలక ఆదేశాలు
[…] Alia Bhatt: ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ – స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రానున్న పాన్ ఇండియా సినిమా గురించి లేటెస్ట్ అప్ డేట్ వినిపించింది. నిజానికి ఈ సినిమా ఎనౌన్స్ చేసినప్పటి నుండి.. ఎన్టీఆర్ సరసన ఫలానా స్టార్ హీరోయిన్ అయితే బాగుంటుంది. లేదు, ఫలానా హీరోయిన్ ను ఆల్ రెడీ హీరోయిన్ గా ఫిక్స్ అయింది అంటూ, ఇలా అనేక రకాలుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. […]