అక్రమాస్తులంటూ ఆరోపిస్తూ ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై నమోదు చేసిన కేసులు ఒక్కొక్కటిగా విచారణకు వస్తున్నాయి. సీఎం కాకముందు రెగ్యులర్‌గా జగన్ సీబీఐ కోర్టుకు హాజరయ్యే వారు. సీఎం అయ్యాక తనకు మినహాయింపులు ఇవ్వాలంటూ కోరారు. కొద్ది రోజుల పాటు మినహాయింపులు ఇచ్చినా ఆ తర్వాత హాజరు కావాల్సిందేనంటూ కోర్టు ఆదేశాలిచ్చింది.
Also Read: హాట్ టాపిక్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు ఎప్పుడు?
అయితే.. తాజాగా తనను జగతి కేసు నుంచి తప్పించాలంటూ జగన్ మోహన్‌రెడ్డి సీబీఐ కోర్టును కోరారు. సీబీఐ తనపై ఏ విధమైన క్రిమినల్ అభియోగాలు మోపలేదని ఆయన గుర్తు చేస్తూ తనను ఈ కేసు నుంచి తప్పించాలని కోరారు.
జగన్ అక్రమాస్తుల కేసులపై సీబీఐ కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కోర్టులో వాదనలు జరిగాయి. సీబీఐ దాఖలు చేసిన 11, ఈడీ దాఖలు చేసిన 5 చార్జిషీట్లపై సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బీఆర్ మధుసూదన్‌రావు విచారించారు. జగతి పెట్టుబడులు, వాన్ పిక్, రాంకీ, పెన్నా సిమెంట్స్, రఘురాం సిమెంట్స్ వంటి కీలక కేసులు విచారణకు వచ్చాయి.
Also Read: పేదల కోసం సోము వీర్రాజు ఓ మంచి నిర్ణయం
అయితే.. ఈ కేసుల నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ డిశ్చార్జి పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదించారు. కంపెనీల చట్టాన్ని దర్యాప్తు అధికారి తప్పుగా పేర్కొన్నారని ఆయన చెప్పారు. కంపెనీల చట్టంలోని ఏ నిబంధనను ఉల్లంఘించారనే విషయాన్ని ఎక్కడా పొందుపరచలేదని ఆయన వెల్లడించారు. ఈ విచారణ న్యాయమూర్తి వాయిదా వేయగా.. రాంకీ కేసులో వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి మరో డిశ్చార్జి పిటిషన్ వేశారు.