https://oktelugu.com/

 షాకింగ్.. రేటు పెంచి డిస్కౌంట్ ఇచ్చిన రష్మిక..!

కరోనా క్రైసిస్ తో సినిమా ఇండస్ట్రీ కుదేలైంది. సినిమా షూటింగులు నిలిచిపోగా.. థియేటర్లు మూతపడ్డాయి. దీంతో వేలకోట్ల వ్యాపారం ఎక్కడికక్కడ స్తంభించడంతో ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారంతా రోడ్డున పడాల్సి వచ్చింది. అయితే ఇటీవలే షూటింగులు.. థియేటర్లు ఓపెన్ కావడంతో ఈ రంగం క్రమంగా కోలుకుంటోంది. Also Read: మెగా సినిమా: చిరంజీవి-దిల్ రాజు కాంబో సెట్టయిందా? కరోనా ఎఫెక్ట్ తో నిర్మాతలు భారీగా నష్టపోయారు. దీనికితోడు కేంద్రం విధించిన కరోనా నిబంధనలతో నిర్మాతలపై మరింత […]

Written By:
  • NARESH
  • , Updated On : October 28, 2020 / 01:24 PM IST
    Follow us on

    కరోనా క్రైసిస్ తో సినిమా ఇండస్ట్రీ కుదేలైంది. సినిమా షూటింగులు నిలిచిపోగా.. థియేటర్లు మూతపడ్డాయి. దీంతో వేలకోట్ల వ్యాపారం ఎక్కడికక్కడ స్తంభించడంతో ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారంతా రోడ్డున పడాల్సి వచ్చింది. అయితే ఇటీవలే షూటింగులు.. థియేటర్లు ఓపెన్ కావడంతో ఈ రంగం క్రమంగా కోలుకుంటోంది.

    Also Read: మెగా సినిమా: చిరంజీవి-దిల్ రాజు కాంబో సెట్టయిందా?

    కరోనా ఎఫెక్ట్ తో నిర్మాతలు భారీగా నష్టపోయారు. దీనికితోడు కేంద్రం విధించిన కరోనా నిబంధనలతో నిర్మాతలపై మరింత భారం పడింది. ఈనేపథ్యలోనే ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు, నటీనటులు, ఇతర సిబ్బంది పారితోషికాలు తగ్గించుకోవాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈమేరకు నటీనటుల పారితోషికాల్లో కోత విధిస్తున్నట్లు నిర్మాతల సంఘం ప్రకటించింది.

    స్టార్ హీరోహీరోయిన్లు తమ పారితోషికం తగ్గించుకోవాలని సూచించింది. ఈమేరకు వారి పారితోషికాల్లో 25నుంచి 30శాతం కోత విధించనున్నట్లు ప్రకటించింది. అయితే స్టార్ హీరోహీరోయిన్లు మాత్రం పారితోషికాలు తగ్గించకపోగా.. భారీగా పెంచేసి రిబేట్ ఇస్తుండటం ఆసక్తిని రేపుతోంది.

    టాలీవుడ్లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక మందన్న తన పారితోషికం భారీగా పెంచి రిబేట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ సినిమా కోసం రష్మిక రెండు కోట్లు డిమాండ్ చేసిందట. తన సినీ జీవితంలో ఈ సినిమాకే అత్యధిక పారితోషికం తీసుకోనుందని టాక్.

    Also Read: నానికి ఇంకో హీరోయిన్ కావలెను

    ఈ సినిమా కోసం రష్మిక 2కోట్లు డిమాండ్ చేసి ఇందులో రూ.25ల‌క్ష‌లు రిబేటు ఇచ్చింద‌ని టాక్ విన్పిస్తోంది. దీంతో రష్మికకు నిర్మాతలు రూ.1.75కోట్లు దక్కనుందట. ఇక స్టార్ హీరోల పక్కన హీరోయిన్లు దొరకడమే గగనం అవుతున్న తరుణంలో హీరోయిన్లతో బేరాలాడే పరిస్థితి లేదని పలువురు నిర్మాతలు వాపోతుండటం గమనార్హం.