https://oktelugu.com/

మహేష్ దూకుడుకి ఎన్టీఆర్ చెక్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం ‘సర్కారువారిపాట’. సీనియర్ హీరో కృష్ణ జన్మదినం సందర్భంగా ‘సర్కారువారిపాట’ సినిమా ప్రారంభమైంది. అదేరోజు ఈ సినిమాకు సంబంధించి ఫస్టు లుక్ విడుదల చేసి అభిమానుల్లో జోష్ నింపారు. అయితే నేటివరకు కూడా ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కాలేదు. దీంతో ఫ్యాన్స్ నిరుత్సాహం చెందుతున్నారు. Also Read: షాకింగ్.. రేటు పెంచి డిస్కౌంట్ ఇచ్చిన రష్మిక..! ‘సర్కారువారిపాట’ సినిమా కథ రీత్య షూటింగు అమెరికాలో చేయాల్సి […]

Written By:
  • NARESH
  • , Updated On : October 28, 2020 / 02:27 PM IST
    Follow us on

    సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం ‘సర్కారువారిపాట’. సీనియర్ హీరో కృష్ణ జన్మదినం సందర్భంగా ‘సర్కారువారిపాట’ సినిమా ప్రారంభమైంది. అదేరోజు ఈ సినిమాకు సంబంధించి ఫస్టు లుక్ విడుదల చేసి అభిమానుల్లో జోష్ నింపారు. అయితే నేటివరకు కూడా ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కాలేదు. దీంతో ఫ్యాన్స్ నిరుత్సాహం చెందుతున్నారు.

    Also Read: షాకింగ్.. రేటు పెంచి డిస్కౌంట్ ఇచ్చిన రష్మిక..!

    ‘సర్కారువారిపాట’ సినిమా కథ రీత్య షూటింగు అమెరికాలో చేయాల్సి ఉంటుంది. దర్శకుడు పర్శురాం సైతం అమెరికాలో షూటింగ్ లోకేషన్లను ఫైనల్ చేశాడు. తీరా షూటింగ్ కోసం చిత్రయూనిట్ అమెరికా బయలుదేరుతున్న సమయంలో వీసాల సమస్య ఎదురైంది. దీంతో ఈ సినిమా షూటింగు మరో రెండు నెలలు వాయిదా పడినట్లు తెలుస్తోంది.

    మహేష్ బాబు ‘సర్కారువారిపాట’ కోసం డేట్స్ క్యాన్సిల్ కావడంతో తెరపైకి త్రివిక్రమ్ సినిమా వచ్చింది. ఇటీవలే మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘ఖలేజా’ మూవీ పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తమ కాంబినేషన్లో మరో సినిమా వస్తుందని మహేష్ బాబు ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ‘సర్కారువారిపాట’ సినిమా వాయిదా పడటంతో త్రివిక్రమ్-మహేష్ కాంబోలో మూవీ వస్తుందనే టాక్ విన్పిస్తోంది.

    త్రివిక్రమ్-ఎన్టీఆర్  కాంబోతో ఓ మూవీ రానున్నట్లు గతంలోనే అధికారిక ప్రకటన వచ్చింది. ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తికాగానే త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మహేష్ సినిమా తెరపైకి వచ్చింది. అయితే మహేష్ తో సినిమా చేస్తే ఎన్టీఆర్ ఏమంటాడో అనే మీమాంసతో ఈ సినిమాను పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది.

    Also Read: ఊపిరి ఆడలేదు.. నాగబాబు హాట్ కామెంట్స్

    కరోనా టైంలోనూ వరుసగా సినిమాలు చేసేందుకు మహేష్ ప్లాన్ చేసుకున్నాడు. అయితే మహేష్ ప్లాన్స్ అన్ని బెడిసి కొడుతున్నాయి. త్రివిక్రమ్ సినిమాను ఎన్టీఆర్ బ్లాక్ చేయడం ద్వారా మహేష్ దూకుడికి ఎన్టీఆర్ చెక్ పెట్టినట్లయింది. తాజా సమాచారం మహేష్-త్రివిక్రమ్ కాంబో మరింత ఆలస్యం కానుందని టాక్ విన్పిస్తోంది. దీంతో మహేష్ బాబు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.