ఆ ఎంపీపై చర్యలకు జగన్ వెనుకడుగు వేశారా?

వైసీపీకి కొరకరాని కొయ్యగా తయారైన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయంలో చర్యలకు ఆ పార్టీ ముందుకు వెళ్లలేకపోతుంది. అసెంబ్లీ సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఎంపీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తాను జగన్ బొమ్మ పెట్టుకుని గెలవలేదని, ఎమ్మెల్యేలు తన బొమ్మపెట్టుకుని గెలిచారన్నారు. ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే తాను చేస్తానని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలను పరోక్షంగా పందులుగా సంభోధించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల అనంతరం ఎంపీపై చర్యలు ఉంటాయని భావించారు. అయితే సమావేశాలు ముగిసి […]

Written By: admin, Updated On : June 22, 2020 1:07 pm
Follow us on

వైసీపీకి కొరకరాని కొయ్యగా తయారైన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయంలో చర్యలకు ఆ పార్టీ ముందుకు వెళ్లలేకపోతుంది. అసెంబ్లీ సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఎంపీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తాను జగన్ బొమ్మ పెట్టుకుని గెలవలేదని, ఎమ్మెల్యేలు తన బొమ్మపెట్టుకుని గెలిచారన్నారు. ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే తాను చేస్తానని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలను పరోక్షంగా పందులుగా సంభోధించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల అనంతరం ఎంపీపై చర్యలు ఉంటాయని భావించారు. అయితే సమావేశాలు ముగిసి మూడు రోజులు అవుతున్నా ఆ విషయంపై వైసీపీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయంలో వైసీపీ చర్యలు తీసుకునే ధైర్యం చేయడం లేదు. ఇందుకు కారణం లేక పోలేదు. రఘురామ కృష్ణంరాజు బీజేపీతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే వెంటనే బీజేపీలో చేరతారు. దీని వల్ల వైసీపీకి వచ్చే లాభం ఏమీ లేదు. అదేవిధంగా ఎంపీ రాజుకు వచ్చే నష్టం ఏమీ లేదు, మరో నాలుగేళ్లు ఆయన ఎంపీగా కొనసాగుతారు. రాజును సస్పెండ్ చేయడం వల్ల ఆయనతో పాటు మరి కొంతమంది ఎంపీలు బీజేపీలో చేరతారనే సమాచారంతోనే వైసీపీ అధిష్టానం చర్యలకు వెనుకాడుతుందని తెలుస్తోంది.
కొద్దీ రోజుల కిందట వైసీపీ ఎంపీలు పది మంది బీజేపీ లో చెరతారని వార్తలు వచ్చాయి. దీంతో ఎంపీ రఘురామ కృష్ణంరాజును సస్పెండ్ చేయడం వల్ల అతను బీజేపీలో చేరితే మరికొంత ఎంపీలు ఆ బాట పెట్టె అవకాశం ఉందని పార్టీలో చర్చలు జోరుగా సాగితున్నాయి. ప్రస్తుతం 23 ఎంపీలతో దేశంలో నాల్గవ అతి పెద్ద పార్టీగా వైసీపీ ఉంది.
ఇప్పుడు ఎంపీలను దూరం చేసుకోవడం వల్ల పార్టీయే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని పార్టీ అధిష్టానం భావిస్తోంది. దీంతో ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై చర్యలు తీసుకునేందుకు పార్టీ అధినేత జగన్ సిద్ధంగా లేరు. మరోవైపు ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారంలో అతిగా స్పందించవద్దని స్థానిక పార్టీ నేతలకు సూచించినట్లు సమాచారం. దీంతో  ఈ విషయాన్ని తాత్కాలికంగా తెరమరుగు చేయాలని వైసీపీ భావిస్తోంది.