https://oktelugu.com/

బాలయ్య వంద  కోట్లు మార్క్ కోసం.. ? 

మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్  లాంటి స్టార్ హీరోల సినిమాలు వంద  కోట్లు మార్క్ ను ఎప్పుడో దాటేశాయి.   ఇక సీనియర్ స్టార్ హీరోల్లో మెగాస్టార్ వంద  కోట్లు మార్క్ ను దాటితే, వెంకటేష్ కూడా డెబ్భై  కోట్లు మార్క్ ను  దాటాడు. కానీ పాపం బాలయ్య సినిమాలే  ఈ మధ్య గట్టిగా పది కోట్లు కూడా కలెక్ట్ చేయలేని  దుస్థితిలోకి వెళ్లిపోయాయని బాలయ్య ఫ్యాన్సే ఫీల్ అవుతున్నారు. అయినా వరుసగా డిజాస్టర్లు ఇవ్వడం బాలకృష్ణకు కొత్తేమి […]

Written By:
  • admin
  • , Updated On : June 21, 2020 / 05:41 PM IST
    Follow us on

    మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్  లాంటి స్టార్ హీరోల సినిమాలు వంద  కోట్లు మార్క్ ను ఎప్పుడో దాటేశాయి.   ఇక సీనియర్ స్టార్ హీరోల్లో మెగాస్టార్ వంద  కోట్లు మార్క్ ను దాటితే, వెంకటేష్ కూడా డెబ్భై  కోట్లు మార్క్ ను  దాటాడు. కానీ పాపం బాలయ్య సినిమాలే  ఈ మధ్య గట్టిగా పది కోట్లు కూడా కలెక్ట్ చేయలేని  దుస్థితిలోకి వెళ్లిపోయాయని బాలయ్య ఫ్యాన్సే ఫీల్ అవుతున్నారు. అయినా వరుసగా డిజాస్టర్లు ఇవ్వడం బాలకృష్ణకు కొత్తేమి కాదు, ‘సింహా’కి ముందు బాలకృష్ణ సినిమాల ప్లాప్ ల పరంపర అందరికీ ఇంకా గుర్తు ఉంది. అయితే  ‘సింహా’తో  బాలయ్యకు సాలిడ్  హిట్ వచ్చింది.

    మళ్లీ ఇప్పుడు బాలకృష్ణకు ‘సింహా’ లాంటి హిట్ కావాలి.   ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో  రాబోతున్న సినిమాతో అలాంటి హిట్ కొట్టాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.  అందుకే  ఈ సినిమా కథను కొత్తాగా తీసుకున్నారు. బాలయ్య బాబు ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో  పూర్తి ఆధ్యాత్మిక వేత్తగా కనిపించబోతున్నాడు.  ఇంతకీ ఆధ్యాత్మిక వేత్తగా బాలయ్య ఎందుకు మారాడు ? ఎలా మారాడు ? దాని వెనుక ఉన్న  గతం ఏమిటి అనే కోణంలో  ఒక చిన్న ఎమోషనల్ స్టోరీ  ప్లాష్ బ్యాక్ రూపంలో వస్తోందట.  మొత్తానికి బాలయ్య బాబు డిజాస్టర్ల దెబ్బకి   కొత్తగా ట్రై చేస్తున్నాడు

    ఎలాగైనా వంద  కోట్లు మార్క్ ను దాటాలనే లక్ష్యంతో బాలయ్య – బోయపాటి ఈ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.  మరి మిర్యాల రవీందర్ రెడ్డికి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను ఇస్తోందో.