
టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని – సుధీర్ బాబు కలయికలో రాబోతున్న చిత్రం ‘వి’. అయితే ఈ సినిమా ఎండింగ్ గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఫిల్మ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా కథకు ముగింపు లేదట. అంటే సినిమా ముగిసిన చోట నుండే మరో కొత్త కథ స్టార్ట్ అవుతుందట. అంటే ఈ చిత్రానికి సీక్వెల్ టైపు.. మొత్తానికి ఈ సినిమాకి సీక్వెల్ ఉండటానికి అవకాశం ఉంది అన్నమాట.
మరి ఈ సినిమాకొచ్చే సక్సెస్ ను బట్టి సీక్వెల్ చేయాలా వద్దా అనేది డిసైడ్ చేయాలని మేకర్స్ ప్లాన్ లో ఉన్నారు. ఇక ఈ సినిమాలో నాని, సుధీర్ బాబు మధ్య నువ్వా నేనా? అనేలా యాక్షన్ సీన్స్ ఉంటాయట. సినిమాలో ఇవే ప్రధాన ఆకర్షణగా ఉంటాయట. పైగా ఇంద్రగంటి అంటేనే వైవిధ్యం. నానితో చేసిన రెండు సినిమాల్లోనూ నానిని డిఫరెంట్ యాంగిల్ లో చూపించి సక్సెస్ కొట్టాడు.
మళ్ళీ ఇప్పుడు నానిని విలన్ క్యారెక్టర్‌లో ఆవిష్కరిస్తూ.. సుధీర్‌బాబును పవర్‌ఫుల్ పోలీస్ రోల్ లో చూపిస్తున్నాడు. ఈ సినిమాలో బ్యూటీఫుల్ లవ్‌స్టోరీ కూడా ఉంటుందట. హిట్ సినిమాల నిర్మాత దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో శిరీష్, హర్షిత్ రెడ్డి నిర్మాతలుగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.