https://oktelugu.com/

డైరెక్టర్ తో ఆడుకుంటున్న హీరోలు !

దర్శకుడు అజ‌య్ భూప‌తి పరిస్థితి మరీ కామెడీగా ఉంది. ఊరు పేరు లేని హీరోతో సూపర్ హిట్ కొట్టి.. కార్తికేయ అనే కుర్రాడిని హీరోగా నిలబెట్టాడు. దాంతో కార్తికేయ ఇప్పటికే నాలుగు సినిమాలు చేశాడు. కానీ అజయ్ భూపతి మాత్రం మహా సముద్రంలోనే మునిగిపోయాడు. సినిమా సెట్స్ పైకి వెళ్లాలంటే చాలా కష్టం, నిజమే.. కానీ హిట్ వచ్చాక కూడా అతిగతి లేకపోతే ఎలా.., నిజంగా తన మొదటి సినిమా అవకాశం కోసం ఎంత కష్టపడ్డాడో తెలియదు […]

Written By:
  • admin
  • , Updated On : July 22, 2020 / 12:38 PM IST
    Follow us on


    దర్శకుడు అజ‌య్ భూప‌తి పరిస్థితి మరీ కామెడీగా ఉంది. ఊరు పేరు లేని హీరోతో సూపర్ హిట్ కొట్టి.. కార్తికేయ అనే కుర్రాడిని హీరోగా నిలబెట్టాడు. దాంతో కార్తికేయ ఇప్పటికే నాలుగు సినిమాలు చేశాడు. కానీ అజయ్ భూపతి మాత్రం మహా సముద్రంలోనే మునిగిపోయాడు. సినిమా సెట్స్ పైకి వెళ్లాలంటే చాలా కష్టం, నిజమే.. కానీ హిట్ వచ్చాక కూడా అతిగతి లేకపోతే ఎలా.., నిజంగా తన మొదటి సినిమా అవకాశం కోసం ఎంత కష్టపడ్డాడో తెలియదు గాని, రెండో సినిమా కోసం మాత్రం అజయ్ ఎన్నో రాత్రులు ఎదురు చూడాల్సి వస్తోంది. అయినప్పటికీ అజయ్ కి మాత్రం సినిమా సెట్ కావట్లేదు. ఆ హీరో ఈ హీరో అంటూ రూమర్స్ అయితే లెక్కకి మించి వచ్చాయి గానీ, ఇంతవరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

    Also Read: ఎవరు ఏమన్నా ఎక్స్ పోజింగే కంఫర్ట్ అట !

    పొరపాటున ఒక సినిమా హిట్ అయితే చాలు, ఇక ఆ డైరెక్టర్ చుట్టూ అవకాశాలు క్యూ కడతాయని ఇండస్ట్రీలో తరుచూ చెప్పుకుంటారు. కానీ అజయ్ విషయంలో ఇలా జరగపోగా.. సినిమా చేయడానికి ఒప్పుకున్న హీరోలు కూడా హ్యాండ్ ఇస్తున్నారు. ఈ రోజుల్లో సక్సెస్ ఉన్నోళ్లకు షేక్ హ్యాండ్ తప్ప, హ్యాండ్ ఇవ్వరు. కానీ పాపం అజయ్ కే ఇలా జరుగుతుంది అనుకుంటా. మొదట తానూ ఇప్పుడు చేయాలనుకున్నా మహాసముద్రం సినిమాని రామ్ తో చేయలనుకున్నాడు. రామ్ ఒప్పుకున్నాక, మధ్యలో వద్దు అన్నాడు. ఆ తరువాత యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో అనుకున్నా.. మొత్తానికి బెల్లంకొండ కూడా భయపడ్డాడు.

    Also Read: సూసైడ్‌ ఆర్‌ మర్డర్… సుశాంత్‌పై బయోపిక్‌

    అక్కడ నుండి రవితేజ దగ్గరకు వచ్చాడు. రవితేజ కూడా ఓకే అని చివర్లో తప్పుకున్నాడు. ఆ తరువాత సమంత – నాగచైతన్య జంటగా అనుకున్నా అదీ లేదని తేలిపోయింది. చివరకు ఎలాగోలా శర్వానంద్ ను ఒప్పించాడు. లాక్ డౌన్ తరువాత అధికారికంగా ఈ సినిమాని ప్రకటించబోతున్నారని అనుకునే లోపు ఇప్పుడు ఈ సినిమా నుండి శర్వానంద్ కూడా తప్పుకునట్లు తెలుస్తోంది. ఇది నిజం అయితే, అజయ్ భూపతికి కోలుకోలేని దెబ్బే. ఏమైనా హీరోలు ఈ డైరెక్టర్ తో ఆడుకుంటున్నారు.