https://oktelugu.com/

నాసిరకం విత్తనాలపై జగన్ ప్రభుత్వం గప్ చిప్!

విత్తనాల నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్వయంగా హెచ్చరికలు చేసిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల అనంతపురంలో బయటపడ్డ నాసిరకం వేరుశనగ, కర్నూలులో వెలుగు చేసిన అనుమతుల్లేని బిటి -3 పత్తి విషయంలో మాత్రం పెదవి విప్పడం లేదు. ఈ రెండు ఉదంతాలపై తొలుత హడావిడి చేసిన ప్రభుత్వం ఒక్కరంటే ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తోంది. అక్రమాలపై శాఖాపరమైన విచారణ అంటూ సాగదీస్తూనే, అవసరమైన అధికార పార్టీ నేతల […]

Written By: , Updated On : June 1, 2020 / 11:41 AM IST
Follow us on


విత్తనాల నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్వయంగా హెచ్చరికలు చేసిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల అనంతపురంలో బయటపడ్డ నాసిరకం వేరుశనగ, కర్నూలులో వెలుగు చేసిన అనుమతుల్లేని బిటి -3 పత్తి విషయంలో మాత్రం పెదవి విప్పడం లేదు.

ఈ రెండు ఉదంతాలపై తొలుత హడావిడి చేసిన ప్రభుత్వం ఒక్కరంటే ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తోంది. అక్రమాలపై శాఖాపరమైన విచారణ అంటూ సాగదీస్తూనే, అవసరమైన అధికార పార్టీ నేతల జోక్యంతో ‘సర్దుబాట్లు’ చేస్తున్నట్లు తెలుస్తున్నది.

ఎపి సీడ్స్‌కు నాసిరకం వేరుశనగ విత్తనాలను సరఫరా చేసిన కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఒక సంస్థలో అధికార పార్టీకి చెందిన ప్రముఖుల పెట్టుబడులు ఉండడమే అందుకు కారణంగా చెబుతున్నారు. వేరుశెనగ విత్తనాలను అత్యధికంగా వీరి నుండే సేకరించారు. బిటిా-3 పత్తి అంశంలోనూ ఇదే విధమైన వైఖరి తీసుకున్నట్లు తెలిసింది.

ప్రభుత్వం రైతులకు పబ్సిడీపై పంపిణీ చేస్తున్న వేరుశనగ విత్తనాల్లో నాసిరకం ఉండటం, అనంతపురంలో రైతులు ఆందోళనలు చేయడంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఉన్నతాధికారులతో ప్రాధమిక దర్యాప్తు చేయించింది.

అక్రమార్కులపై చర్యలు తీసుకోవలసింది పోయి, రెండు మూడ్రోజుల క్రితం వ్యవసాయ మంత్రి కన్నబాబు, ఉన్నతాధికారుల నుంచి మండల స్థాయి వరకు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి మీడియాకు సమాచారం ఇస్తూ ఇంటి గుట్టు రట్టు చేస్తున్నారని అంటూ అధికారులపై మండిపడినట్లు తెలుస్తున్నది.

ఎపి సీడ్స్‌ ప్రతి ఏటా సర్టిఫైడ్‌ సీడ్‌నే సేకరిస్తుంది, కానీ ఈ తడవ అందుకు విరుద్ధంగా రాజాకీయ వత్తిడుల కారణంగా ప్రైవేటు కంపెనీలు ట్రూత్‌ఫుల్‌ సీడ్‌ను సరఫరా చేసినా పట్టించుకోలేదు.

ఇక కర్నూలులో ఒక గోదాములో పెద్ద ఎత్తున అనుమతుల్లేని బిటి-3 పత్తి విత్తనాలను నిల్వ చేశారని ఆరోపణలు రాగా, ఈ నెల 13న గోదామును తనిఖీ చేసిన వ్యవసాయ అధికారులు ఎలాంటి శాంపిల్స్‌ కూడా తీయలేదు. ఈ నెల 18న జిల్లా స్థాయి అధికారి ఆధ్వర్యంలో శాంపిల్స్‌ తీసినా ఇంకా ల్యాబ్ రిపోర్ట్ ను బైట పెట్టలేదు.