అన్నీ ఉన్నా అదేదో అనే సామెతలా ఏపీలో జగన్ సర్కార్ పరిస్థితి ఉంది. రాష్ట్రంలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి వైసీపీ పాజిటివ్ విషయాల్లో కంటే నెగిటివ్ విషయాల్లోనే ఎక్కువగా హైలెట్ అవుతోంది. 15 నెలల పాలనా కాలంలో జగన్ సర్కార్ ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంది. అయితే ఆ నిర్ణయాల్లో మెజారిటీ నిర్ణయాలకు హైకోర్టు చీవాట్లు తప్పలేదు. పలు కేసుల్లో జగన్ సర్కార్ సుప్రీం కోర్టు మెట్లెక్కింది.
Also Read : వ్యవసాయ బిల్లులు కార్పొరేట్లకు దోచిపెట్టడమా?
అయితే మెజారిటీ సందర్భాల్లో సుప్రీం కోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పులనే సమర్థించడం గమనార్హం. ఏపీలో న్యాయవ్యవస్థకు జగన్ సర్కార్ కు దూరం పెరగడం వల్లే వైసీపీ రాజ్యసభ ఎంపీ రాజ్యసభలో న్యాయవ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతు ఇవ్వడం కూడా ప్రజలకు నచ్చలేదు. టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతు ఇస్తే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
జగన్ సర్కార్ హామీల వరకు బాగానే అమలు చేస్తున్నా మిగిలిన విషయాల సంగతేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కరోనా, లాక్ డౌన్ వల్ల ఆదాయం భారీగా తగ్గిందని అయితే అదే సమయంలో ఖర్చులు మాత్రం భారీగా పెరిగాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో గతంతో పోలిస్తే టికెట్ రేట్లు భారీగా పెంచారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అధిక వర్షాల వల్ల పంట నీట మునుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని… ప్రభుత్వానికి ప్రతిపక్షాలపై విమర్శలు చేయడానికి ఉన్నంత సమయం అభివృద్ధి చేయడానికి లేదా…? అని ప్రజలు కామెంట్లు చేస్తున్నారు. నిత్యావసర వస్తువులు, కూరగాయలు కొనాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తోందని… ప్రభుత్వం ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ప్రజల్లో వ్యతిరేకత పెరిగితే 2019లో టీడీపీకి పట్టిన గతే 2024లో వైసీపీకి పడుతుందని సున్నితంగా హెచ్చరిస్తున్నారు.
Also Read : అచ్చెన్నాయుడికి జ్ఞానోదయం కలిగిందా..?