Jagan To Delhi: అప్పులు ఉంటే ఎవరైనా ఏం చేస్తారు.. ఒకచోట చెల్లించేది ఉంటే మరోచోట అప్పు తెస్తారని చెబుతారా.. కానీ ఇది చాలా తప్పు. రాబోయే చెల్లింపులను ముందే పసిగట్టి అందుకు తగ్గట్టు ఆదాయ మార్గాలను పెంచుకోవాలి. అంతేకానీ ఆ చెల్లింపుల కోసం మరో అప్పు ఎలా చేయాలి అని ఆలోచించవద్దు. అలా చేస్తే అప్పుల భారం మరింత పెరుగుతుందే తప్ప ఏ మాత్రం తగ్గదు. కానీ ఇప్పుడు జగన్ మాత్రం పదే పదే ఇలాంటి తప్పు చేస్తున్నారు.

అప్పులు ఎలా తీర్చాలి అని ఏమాత్రం ఆలోచించట్లేదు. ఎంతసేపు మరో అప్పు ఎలా తేవాలి అనే దానిపైనే ఫోకస్ పెడుతున్నారు. కొత్త అప్పు కోసం పర్మిషన్ ఎలా తెచ్చుకోవాలి, ఏమేం అమ్మేయాలి అని వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం మరోసారి ఢిల్లీ వెళ్ళబోతున్నారు. పీఎం నరేంద్ర మోడీని కలిసి కొత్త అప్పుల కోసం పర్మిషన్ తెచ్చుకోబోతున్నారు.
ఎలాగూ కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చింది కాబట్టి.. కేంద్రం కూడా త్వరగానే పర్మిషన్ ఇస్తుందని జగన్ నమ్ముతున్నారు. మరి ఇప్పటికిప్పుడు అప్పు ఎందుకు అంటారా.. ఇంకెందుకండి రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలివ్వాలి. ప్రభుత్వ ఖజానాలో ఒక్క రూపాయి కూడా లేదు. పైగా ప్రభుత్వం నడిపేందుకు కావాల్సిన నిధులు కూడా లేవు. ఇప్పటికే వేస్ అండ్ మీన్స్ సౌకర్యాన్ని కూడా జగన్ ప్రభుత్వం వాడుకుంది.
మొన్ననే అప్పులోళ్లకు ఉన్న నిధులన్నీ చెల్లింపులు చేసేసింది. కాబట్టి అర్జంటుగా జగన్ ప్రభుత్వానికి మరో అప్పు కావాల్సి వచ్చింది. అయితే జగన్ టూర్ ను రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు ఇతర అంశాలపై చర్చించేందుకు వెళ్తున్నట్టు చిత్రీకరిస్తున్నారు వైసీపీ నేతలు. కానీ అసలు లక్ష్యం మాత్రం అప్పు. మరి ఆ విషయం బయట పెడితే పరువు పోతుందని ఇలా కవర్ చేస్తున్నారన్నమాట.
జగన్ పాలన చూస్తుంటే దివాలా తీసిన కంపెనీ లాగే అనిపిస్తోంది రాష్ట్రం పరిస్థితి. ఎంతసేపు కొత్త అప్పుల కోసం దారులు వెతకడమే తప్ప ఆర్థిక వృద్ధి పెంచే ఆలోచన మాత్రం చేయట్లేదు. ఇలాగే కొనసాగితే ఏపీలో ఆర్థిక సంక్షోభం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
[…] Also Read: మోడీజీ కనికరించండి.. మళ్లీ అప్పు కోసం … […]