సుప్రీం కోర్టులో జగన్‌ అఫిడవిట్‌ దాఖలు

అక్టోబర్ 6వ తేదీన న్యాయమూర్తులపై జగన్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డేకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. లేఖరూపంలో చేసిన ఫిర్యాదు కావడంతో అప్పట్లో దేశమంతా సంచలనం సృష్టించింది. ఆ ఫిర్యాదుపై ఇపుడు చీఫ్ జస్టిస్ విచారణ మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆ అఫిడవిట్‌ను సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే పరిశీలిస్తున్నారు. Also Read: పేకాట క్లబ్బులపై పోలీసుల దాడులు.. ఏపీలో ఏం జరుగుతోంది..? అయితే.. తాజాగా సుప్రీం కోర్టులో జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్ […]

Written By: Srinivas, Updated On : January 4, 2021 2:29 pm
Follow us on


అక్టోబర్ 6వ తేదీన న్యాయమూర్తులపై జగన్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డేకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. లేఖరూపంలో చేసిన ఫిర్యాదు కావడంతో అప్పట్లో దేశమంతా సంచలనం సృష్టించింది. ఆ ఫిర్యాదుపై ఇపుడు చీఫ్ జస్టిస్ విచారణ మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆ అఫిడవిట్‌ను సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే పరిశీలిస్తున్నారు.

Also Read: పేకాట క్లబ్బులపై పోలీసుల దాడులు.. ఏపీలో ఏం జరుగుతోంది..?

అయితే.. తాజాగా సుప్రీం కోర్టులో జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్ దాఖలు చేశారు. సుప్రీం జస్టిస్ ఎన్వీ రమణ హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరితో పాటు మరో ఆరుగురు జడ్జీలపై జగన్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన మూడు నెలలకు బాబ్డే విచారణ మొదలుపెట్టారు. ఫిర్యాదు చేసిన జగన్ కు ఫిర్యాదులు ఎదుర్కొన్న రమణ మహేశ్వరికి కూడా నోటీసులు ఇచ్చారు. జగన్ కు ఇచ్చిన నోటీసులో తాను చేసిన ఫిర్యాదు మొత్తం వాస్తవమేనని చెబుతూ ఓ అఫిడవిట్ దాఖలు చేయాలని కోరారట. అలాగే తన ఫిర్యాదులకు అవసరమైన ఆధారాలను కూడా అందజేయాలని స్పష్టంగా చెప్పారట.

Also Read: ఏపీలో దేవుళ్ల విగ్రహాల ధ్వంసంపై జగన్ సంచలన వ్యాఖ్యలు

ఆ నోటీసు అందుకున్న జగన్‌.. వెంటనే స్పందించారు. జగన్ వెంటనే సుప్రీం కోర్టు అడిగినట్లు అఫిడవిట్‌తోపాటు తన ఫిర్యాదులకు మద్దతుగా 15 రోజుల క్రితమే ఆధారాలను కూడా అందించినట్లు సమాచారం. అలాగే ఎన్వీ రమణ, మహేశ్వరిలకు ఇచ్చిన నోటీసులు ఇచ్చి జగన్ ఫిర్యాదులపై సరైన సమాధానం కోరారట. ఎన్వీ రమణ ఇచ్చిన సమాధానం ఏమిటన్నది స్పష్టంగా తేలలేదు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

మరోవైపు.. జగన్ చేసిన ఫిర్యాదులో ప్రాథమిక సాక్ష్యాధారాలు కన్విన్స్‌ అయ్యేలా ఉండడంతో మహేశ్వరిని బదిలీ చేశారనే ప్రచారం జరుగుతోంది. ఉన్నపళంగా మహేశ్వరి ఏపీ హైకోర్టు నుంచి సిక్కిం హైకోర్టుకు బదిలీ చేయబడ్డారు. అలాగే వీళ్లిద్దరిపై వచ్చిన ఫిర్యాదులను సుప్రీం కోర్టులోని సీనియర్ జడ్జీలతో కూడా బాబ్డే చర్చించారట. ఫిర్యాదులపై లోతుగా విచారణ జరిపితే కానీ వాస్తవాలు బయటకు రావని మెజారిటీ జడ్జీలు సూచించినట్లు సమాచారం. ఇక ఈ విషయంలో బాబ్డే ఎలా స్పందిస్తారో చూడాలి.