https://oktelugu.com/

లివ్-ఇన్ రిలేషన్ పై దీపికా హాట్ కామెంట్స్ !

బాలీవుడ్ టాప్ హీరోయిన్ అందాల భామ దీపికా పదుకునే ఇటీవల ఒక పత్రిక ఇంటర్వ్యూలో మ్యారేజ్ కి ముందు భర్త రణవీర్ సింగ్ తో కలిసి లివ్-ఇన్ రిలేషన్ ని ఎందకు ఇష్టపడలేదో చెప్పుకొచ్చారు. సాధారణంగా బాలీవుడ్ లో ప్రేమ వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి, ఆ రేంజ్ లోనే బ్రేకప్స్ కూడా ఉంటాయనుకోండి. కానీ ఆరు సంవత్సరాల ప్రేమ తర్వాత వీరిద్దరూ 2018 లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వారిద్దరూ ఏ విషయంలోనూ తొందర పడకుండా తగినంత […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 4, 2021 / 02:06 PM IST
    Follow us on


    బాలీవుడ్ టాప్ హీరోయిన్ అందాల భామ దీపికా పదుకునే ఇటీవల ఒక పత్రిక ఇంటర్వ్యూలో మ్యారేజ్ కి ముందు భర్త రణవీర్ సింగ్ తో కలిసి లివ్-ఇన్ రిలేషన్ ని ఎందకు ఇష్టపడలేదో చెప్పుకొచ్చారు. సాధారణంగా బాలీవుడ్ లో ప్రేమ వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి, ఆ రేంజ్ లోనే బ్రేకప్స్ కూడా ఉంటాయనుకోండి. కానీ ఆరు సంవత్సరాల ప్రేమ తర్వాత వీరిద్దరూ 2018 లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వారిద్దరూ ఏ విషయంలోనూ తొందర పడకుండా తగినంత సమయం తీసుకుని వారి బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్లారట. బి-టౌన్ లో అత్యంత ఆదర్శ జంటలలో ఒకరిగా దీపికా, రణవీర్ ని ఒకరిగా పేర్కొంటారు.

    Also Read: క్రేజీ మల్టీస్టారర్ ‘యానిమల్’లో యంగ్ బ్యూటీ ?

    ఒక పత్రికా ఇంటర్వ్యూలో, దీపికాని రణ్‌వీర్‌తో లివ్-ఇన్ సంబంధాన్ని ఎందుకు ఎంచుకోలేదని అడగగా… ఈ రోజుల్లో చాలామంది జీవితకాల భాగస్వామిని నిర్ణయించటానికి ముందు తమ భాగస్వాములతో కలిసి జీవించడాన్ని ఒక మంచి అవకాశంగా భావిస్తున్నారు. వివాహానికి సంబంధించినంతవరకు సాంప్రదాయ మార్గాన్ని అనుసరించాలని తాను కోరుకున్నానని, అదే ఉత్తమ నిర్ణయంగా మేమిద్దరం భావించామని దీపికా వెల్లడించారు.

    Also Read: ఆకట్టుకుంటున్న ‘యానిమల్’ టైటిల్ టీజర్ !

    పెళ్ళికి ముందే కలిసి జీవిస్తే పెళ్లి తరవాత కొత్తగా చేయటానికి, తెలుసుకోవటానికి ఏం ఉంటాయని ప్రశ్నించారు. వివాహం గురించి ప్రజలు విరక్తి కలిగి ఉన్నారని నాకు తెలుసు , కానీ అది మా అనుభవం కాదు. మేము ఆచారాన్ని నమ్ముతున్నాము దానిలోని ప్రతి అంశాన్ని మేము ఆనందిస్తున్నాము ” అని ఇంటర్వ్యూలో దీపిక అన్నారు. దీపిక మరియు రణవీర్ ఇటీవల తమ నూతన సం వత్సర వేడుకల్ని అలియా భట్-రణబీర్ కపూర్‌తో కలిసి ‘రణతంబోర్ నేషనల్ పార్క్’లో జరుపుకున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్