https://oktelugu.com/

దెబ్బతిన్న హీరోలకు ఇప్పుడు ఆ డైరెక్టరే దిక్కు

టాలీవుడ్ లో టాలెంట్ ఉంది కూడా హీరో దొరకని దర్శకులు ఎందరో ఉన్నారు. సుకుమార్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి వంటి దర్శకులు బ్లాక్ బస్టర్స్ హిట్స్ కొట్టి కూడా ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది. తమ కథకు తగ్గ స్టార్ హీరో దొరకక, చిన్న హీరోలతో సినిమాలు చేయలేక చాలా కాలం తరువాత ప్రాజెక్ట్స్ ఓకే చేశారు. ఈ కోవలోకే వస్తాడు దర్శకుడు మారుతీ. టాలీవుడ్ లో మోస్ట్ ఎంటర్టైనింగ్ దర్శకుడిగా పేరున్న మారుతీ హిట్స్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 4, 2021 / 01:58 PM IST
    Follow us on


    టాలీవుడ్ లో టాలెంట్ ఉంది కూడా హీరో దొరకని దర్శకులు ఎందరో ఉన్నారు. సుకుమార్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి వంటి దర్శకులు బ్లాక్ బస్టర్స్ హిట్స్ కొట్టి కూడా ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది. తమ కథకు తగ్గ స్టార్ హీరో దొరకక, చిన్న హీరోలతో సినిమాలు చేయలేక చాలా కాలం తరువాత ప్రాజెక్ట్స్ ఓకే చేశారు. ఈ కోవలోకే వస్తాడు దర్శకుడు మారుతీ. టాలీవుడ్ లో మోస్ట్ ఎంటర్టైనింగ్ దర్శకుడిగా పేరున్న మారుతీ హిట్స్ కొట్టి కూడా సరైన హీరోని పట్టలేక పోతున్నాడు.కాకపోతే స్టార్ హీరోల కోసం ఎదురుచూడకుండా… దొరికిన హీరోతో కాంప్రమైజ్ అవుతున్నాడు. ప్లాఫ్స్ లో ఉన్న హీరోలకు లిఫ్ట్ ఇవ్వడమే ఆయనకు పనిగా మారింది.

    Also Read: క్రేజీ బ్యూటీకి బ్యాడ్ టైమ్.. ఎవ్వరూ పట్టించుకోవట్లేదట !

    ప్రతిరోజూ పండగే మూవీతో మారుతీ పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు. సాయి ధరమ్ కెరీర్ హైయెస్ట్ వసూళ్లు సాధించిన ప్రతిరోజూ పండగే ఆయనను వరుస పరాజయాల నుండి బయటపడేసింది. ఈ మూవీ సక్సెస్ తరువాత ఏకంగా అల్లు అర్జున్ తో మూవీ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశాడు మారుతీ. మెగా కాంపౌండ్ తో మంచి అనుబంధం ఉన్న మారుతీ… ఆయనతో మూవీ చేయడం ఖాయం అనుకున్నారు అందరూ. ఐతే బన్నీ కోసం స్టార్స్ డైరెక్టర్స్ సిద్ధంగా ఉండడంతో మారుతీకి అవకాశం రాలేదు. దీనితో హీరో గోపీచంద్ తో మూవీ చేయడానికి ఆయన సిద్ధం అయినట్లు వార్తలు వస్తున్నాయి.

    Also Read: పెళ్లి అయినా వదట్లేదు.. వరుసగా అవకాశాలు !

    ఈ వార్తల నేపథ్యంలో స్టార్ హీరో దొరకని మారుతీ ప్రతిసారి ప్లాప్ హీరోలకు లిఫ్ట్ ఇవ్వాల్సి వస్తుందని అనుకుంటున్నారు. భలే భలే మగవాడివోయ్ మూవీ వరకు నాని వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడ్డారు. ఆ మూవీ విజయం తరువాత ఆయన కెరీర్ గాడిన పడింది. మరో యంగ్ హీరో శర్వానంద్ పరిస్థితి కూడా అదే… మహానుభావుడు మూవీ వరకు ఆయన ప్లాప్స్ తో ఇబ్బందిపడ్డారు. ఆ సినిమా తరువాత శర్వానంద్ మార్కెట్, కెరీర్ ఊపందుకుంది. మరి ఈ సెంటిమెంట్ కంటిన్యూ అయితే గోపీచంద్ కెరీర్ కూడా మారుతీ మూవీ హిట్ తో గాడిన పడాలి. ఆ విషయం పక్కనపెడితే స్టార్ హీరోతో మూవీ చేసి.. టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి వెళ్లాలన్న మారుతీ కోరిక మాత్రం తీరడం లేదు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్