YS Jagan: 2019 సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చారు. ఇక టీడీపీ ఊహించని స్థాయిలో అతి తక్కువ సీట్లకు పరిమితమై ప్రతిపక్ష పాత్రలోకి వచ్చేసింది. కాగా, ఇటీవల ఏపీ అసెంబ్లీ వేదికగా జరిగిన ఘటనలు, సంస్థాగత ఎన్నికల్లో అధికార వైసీపీ హవా ఇతర రాజకీయ పరిణామాల దృష్ట్యా ఏపీలో ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావాలని టీడీపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల టీడీపీ చీఫ్, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశాడు.
2024 ఎన్నికల్లో వైసీపీని గద్దె దించాలని ఇప్పటి నుంచే టీడీపీ నేతలు రాజకీయ క్షేత్రంలోకి దిగుతున్నారు. తమదైన ఎత్తులు వేసుకుని ముందుకు సాగుతున్నారు. అయితే, ఈ సారి కూడా జగన్ చంద్రబాబుకు అవకాశం ఇవ్వకూడదని అనుకుంటున్నారట. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న అంశాలన్నిటినీ ఒక్కొక్కటిగా సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల టైం ఉన్న నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ విమర్శలు చేయక ముందరే ప్రభుత్వ వ్యతిరేక వర్గాలను అనుకూలంగా మార్చుకోవాలని వైసీపీ అధినాయకత్వం డిసైడ్ అయిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే చంద్రబాబుకు మళ్లీ నిరాశే ఎదురవుతుందని వైసీపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
Also Read: జగన్ ను ఓడించడానికి చంద్రబాబు వేసిన ప్లాన్ ఇదే..
ఇకపోతే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మద్యం బాటిళ్ల గురించి వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఏపీలోని రోడ్ల దుస్థితిపైన ప్రస్తావన చేస్తున్నారు. కాగా, జగన్ సర్కారు మాత్రం అభివృద్ధి పనుల్లో బిజీగా ఉన్నదని కొందరు ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఎన్నికల టైం నాటికి రహదారులన్నీ మరమ్మతులు చేయించి జగన్ సర్కారు ఫుల్ క్రెడిట్ కొట్టేస్తుందని ఈ సందర్భంగా వైసీపీ నేతలు జోస్యం చెప్తున్నారు. ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగులను సైతం వైసీపీ అనుకూలం చేసుకోవడానికి జగన్ సర్కారు అడుగులు వేస్తున్నట్లు వినికిడి. ప్రజల సమస్యలన్నీ పరిష్కరించి మళ్లీ అధికారంలోకి రావాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
Also Read: కొత్త ఏడాదిలో ఏపీ రాజకీయం ఎలా మారనుంది..?