https://oktelugu.com/

Jaggareddy: గరంగరం.. తప్పుకుంటానన్న జగ్గారెడ్డి.. రేవంత్ కు వార్నింగ్..!

Jaggareddy : తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ముందునుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. కాంగ్రెస్ లోని సీనియర్లంతా ఎవరికీ వారే బాస్ అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో క్యాడర్లో అమోమయ పరిస్థితి మారుతోంది. టీపీసీసీ రేవంత్ రెడ్డి చేపడుతున్న ప్రతీ నిర్ణయాన్ని కాంగ్రెస్ లోని ఓ వర్గం నేతలు వ్యతిరేకిస్తుండటమే పనిగా పెట్టుకున్నట్లు కన్పిస్తోంది. దీంతో అసలు రాజకీయంగా కాంగ్రెస్ అంతర్గత రాజకీయమే అందరిలో ఆసక్తి రేపుతోంది. అయితే పార్టీలో నేతల మధ్య జరుగుతున్న రాజకీయం పార్టీకి చేటుతెచ్చేలా […]

Written By:
  • NARESH
  • , Updated On : January 6, 2022 / 11:41 AM IST
    Follow us on

    Jaggareddy : తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ముందునుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. కాంగ్రెస్ లోని సీనియర్లంతా ఎవరికీ వారే బాస్ అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో క్యాడర్లో అమోమయ పరిస్థితి మారుతోంది. టీపీసీసీ రేవంత్ రెడ్డి చేపడుతున్న ప్రతీ నిర్ణయాన్ని కాంగ్రెస్ లోని ఓ వర్గం నేతలు వ్యతిరేకిస్తుండటమే పనిగా పెట్టుకున్నట్లు కన్పిస్తోంది. దీంతో అసలు రాజకీయంగా కాంగ్రెస్ అంతర్గత రాజకీయమే అందరిలో ఆసక్తి రేపుతోంది.

    Telangana Congress

    అయితే పార్టీలో నేతల మధ్య జరుగుతున్న రాజకీయం పార్టీకి చేటుతెచ్చేలా ఉండటంతో అధిష్టానం రంగంలోకి దిగుతున్నారు. ఈక్రమంలోనే నేతల మధ్య సయోధ్యకు అధిష్టానం చర్యలు చేపడుతున్నా ఫలితం మాత్రం రావడం లేదు. బహిరంగంగానే నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈక్రమంలోనే నిన్న తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ జరిగింది. జూమ్ యాప్ ద్వారా సమావేశంలో పాల్గొన్న నేతలు గరంగరంగా చర్చించుకున్నారు.

    ఈ సమావేశంలో పార్టీ యాక్షన్ ప్లాన్ కంటే ఎక్కువగా నేతలు ఒకరిఒకరిపై ఫిర్యాదు చేసుకున్నారని తెలుస్తోంది. అందరూ ఊహించినట్లుగా సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ ఛార్జి మాణిక్యం ఠాకూర్ కు పలు విషయాల్లో రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. తాను ముక్కుసూటిగా మాట్లాడుతానని, తన బాధ అంతా పార్టీ బాగుకోసమనని చెప్పారు. తన తీరు నచ్చకుంటే టీపీసీసీ వర్కింగ్ ప్రెసెడెంట్ పదవీకి రాజీనామా చేస్తానని కామెంట్స్ చేశారు.

    అయితే జగ్గారెడ్డికి మాజీ మంత్రి శ్రీధర్ బాబు, సీనియర్ నేత జానారెడ్డిలు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎవరైనా తప్పులు చేస్తే సరిదిద్దుకోవాలనిగానీ తప్పుకోవడం కరెక్ట్ కాదని సూచించారు. మరోవైపు జగ్గారెడ్డికి మాజీ ఎంపీ అంజన్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. ప్రతీ విషయం అందరికీ చెప్పాలనడం సరికాదని.. హైదరాబాద్ వస్తే తనకు ఎవరైనా సమచారం ఇస్తున్నారా? అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై జగ్గారెడ్డి పదవీతో కాదు కార్యకర్తగా ఎక్కడైనా వెళ్తానంటూ కామెంట్ చేశారు.

    ఈ సందర్భంగా మాణిక్యం ఠాకూర్ రేవంత్ రెడ్డిపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీలోని ముఖ్య నేతలందరికీ కలుపుకోవాలని సూచించారు. పార్టీ అంతర్గత విషయాలు మీడియా ఎదుట మాట్లాడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ పనితీరును ఠాకూర్ తప్పుబట్టినట్లు తెలుస్తోంది. అనంతరం నేతలు పార్టీ యాక్షన్ ప్లాన్ పై చర్చించారు.

    ఈక్రమంలోనే రేవంత్ మట్లాడుతూ ఏఐసీసీ ఇచ్చిన కార్యక్రమాలను తెలంగాణలో విజయవంతం చేస్తున్నామని తెలిపారు. మొత్తంగా పొలిటికల్ ఎఫెర్స్ సమావేశం వాడీవాడీగా సాగినట్లు తెలుస్తోంది. మరీ ఇక నుంచైనా కాంగ్రెస్ నేతలు కలిసి ముందుకు నడుస్తారో లేదో వేచిచూడాల్సిందే..!