Mana Shankara Varaprasad Gaaru: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad gaaru) చిత్రం పై అభిమానుల్లోనే కాదు, సాధారణ ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో పాటు, చాలా కాలం తర్వాత చిరంజీవి పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలో కనిపించడం, అందులో విక్టరీ వెంకటేష్ కూడా కీలక పాత్ర పోషించడం వంటివి ఈ చిత్రం పై అంచనాలు పెరగడానికి కారణం అయ్యాయి. ఇక ఎప్పుడైతే ఈ సినిమా నుండి ‘మీసాల పిల్ల’ పాట విడుదలైందో, అప్పటి నుండి ఈ చిత్రం కచ్చితంగా బ్లాక్ బస్టర్ అని బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయారు ట్రేడ్ పండితులు. అయితే నేడు ఈ సినిమా నుండి విడుదలైన రెండవ పాట ‘శశిరేఖ’ మాత్రం ఫ్యాన్స్ ని అంతగా అలరించలేదు.
ఎప్పుడో 90’S కాలం నాటి ట్యూన్ ని ఇప్పుడు వదిలినట్టుగా అనిపించింది. అంతే కాదు ఈ పాటలో చిరంజీవి, నయనతార తో కలిసి డ్యూయెట్స్ వేయడం కూడా ఫ్యాన్స్ కి అంతగా నచ్చలేదు. చిరంజీవి వయస్సు 70 ఏళ్ళు. ఇప్పటికీ కూడా ఆయన హీరోయిన్స్ తో డ్యూయెట్స్ వేసే సాంగ్స్ ఏంటి?, సహజత్వానికి చాలా దూరం గా ఉంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ అయితే అత్యంత దారుణంగా ఉన్నాయి. నిజమైన లొకేషన్స్ లో పాటని చిత్రీకరించారు, కానీ చూసే ఆడియన్స్ కి మాత్రం గ్రీన్ మ్యాట్ వేసి తీసినట్టు గా అనిపించింది. అంత గొప్పగా ఉంది సినిమాటోగ్రఫీ. మొదటి పాట లో కూడా ఇంతే, మంచి ఇంట్లో షూటింగ్ చేశారు, కానీ సహజత్వం గా అనిపించలేదు. ఇక పాట ట్యూన్ విషయానికి వస్తే, ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై కమర్షియల్ గా పెద్ద హిట్ అయినా ‘లిటిల్ హార్ట్స్’ చిత్రం లోని ‘కాచాయని..భోంచేశావా’ పాట ట్యూన్ గుర్తుకొచ్చింది.
మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మిగిలిన పాటలపై కాస్త శ్రద్ద పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం లో ప్రతీ పాట చార్ట్ బస్టర్ అయ్యింది. ఆ సినిమాకు విడుదలకు ముందు అంతటి హైప్ రావడానికి ముఖ్య కారణం పాటలే. ఇక విడుదలయ్యాక, ఆ చిత్రం లోని పాటలకు ఆకాశమే హద్దు అనే రేంజ్ లో రీచ్ వచ్చింది. ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో ‘మీసాల పిల్ల’ అలాంటి పాట నే, కానీ ఈరోజు విడుదలైన ‘శశిరేఖ’ పాటకు అంత రీచ్ వచ్చే అవకాశమే కనిపించడం లేదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.