Junior NTR Latest Look: గత కొంతకాలం నుండి ఎన్టీఆర్(Junior NTR), ప్రశాంత్ నీల్(Prashanth Neel) మూవీ షూటింగ్ ఆగిపోయింది. రెండు షెడ్యూల్స్ తర్వాత తన ప్రతీ సినిమాకు లాంగ్ గ్యాపిచినట్టుగానే, ఈ చిత్రానికి కూడా అదే విధమైన గ్యాప్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. ఈ గ్యాప్ లో ఈ చిత్రం ఆగిపోయిందని, ఇప్పటి వరకు తీసిన ఔట్పుట్ పై ప్రశాంత్ నీల్ సంతృప్తి గా లేడని, ఆ సన్నివేశాలతో పాటు, స్క్రిప్ట్ మొత్తాన్ని మార్చేసి, మళ్లీ ఫ్రెష్ గా సినిమాని మొదలుపెట్టేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నాడని, ఇలా ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. స్క్రిప్ట్ లో మార్పులు చేయాలనీ అనుకోవడం నిజమే, అదే విధంగా రీ షూటింగ్ కూడా చెయ్యాలని అనుకున్నారు. కానీ సినిమా ఆగిపోయింది అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేడని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.
అయితే రేపటి నుండి ఈ సినిమా కి సంబంధించిన సరికొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ కోసం ఎన్టీఆర్ సిద్దమయ్యాడు. ఆయన లేటెస్ట్ లుక్స్ కి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. ఇందులో ఎన్టీఆర్ అద్దాలు పెట్టుకొని, స్టైలిష్ లుక్ తో కుర్చీలో కూర్చోవడాన్ని చూసి ఆయన అభిమానులు మురిసిపోతున్నారు. ఎన్టీఆర్ ని ఎలా అయితే చూడాలని వాళ్ళు కోరుకున్నారో, అలా చూపిస్తున్నందుకు సంబర పడుతున్నారు. సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ఫోటోనే దర్శనమిస్తోంది. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం లో ఎన్టీఆర్ డ్రగ్స్ మాఫియా లీడర్ గా కనిపించబోతున్నాడని, పూర్తి స్థాయి నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ అని అంటున్నారు. ఇందులో హీరోయిన్ గా రుక్మిణి వాసంత్ నటిస్తోంది. షూటింగ్ కార్యక్రమాలు వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో పూర్తి చేసి, 2027 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
వాస్తవానికి వచ్చే ఏడాది జూన్ నెలలోనే ఈ సినిమాని విడుదల చేయాల్సి ఉంది. కానీ అప్పటికి షూటింగ్ పూర్తి అయ్యే అవకాశాలు అసలు కనిపించడం లేదు. పైగా ప్రశాంత్ నీల్ సినిమా అంటే రీ షూటింగ్స్ సర్వసాధారణం గా ఉంటాయి. విడుదలకు సిద్దమైన ‘సలార్’ చిత్రాన్ని ఆపించేసి, డిసెంబర్ లో విడుదల చేసిన చరిత్ర ఆయనది. అంత పర్ఫెక్షన్ ఉండాలని కోరుకుంటాడు. అలాంటి వ్యక్తి నుండి ఒక సినిమా అంత తేలికగా బయటకు రావడం కష్టమే. కానీ వచ్చిన తర్వాత విద్వంసమే. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ట్రేడ్ లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుంది అనేది.
#NTR pic.twitter.com/FoERkUdgGU
— Cinema Brainiac (@CinemaBrainiac) December 7, 2025