Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల న్యూస్ మేకర్ గా మారారు. ప్రతీరోజు ఆయన ఏదో సందర్భంగా మీడియాలో కనిపిస్తున్నారు. విశాఖలో జరిగిన ‘జనవాణి’ కార్యక్రమంలో పవన్ క్రేజ్ తెలుగు రాష్ట్రాల్లో మరింత ఎక్కువైంది. ఓ వైపు హీరోగా సినిమాల్లో నటిస్తున్నా.. మరోవైపు ప్రజల తరుపున పోరాడే నాయకుడిగా జననాయకుడినిపించుకుంటున్నారు. దీంతో ఆయన ఎక్కడికి వెళ్లినా నీరాజనం పలుకుతున్నారు. ఇటీవల ఆయన తిరమలకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనను చూసేందుకు వచ్చిన జనాన్ని చూసి మిగతా రాజకీయ నాయకులు షాక్ తింటున్నారు. త్వరలో పవన్ కల్యాణ్ మంచి లీడర్ గా ఎదుగుతాడని ఆశిస్తున్నారు.

సినీ హీరోగా పవన్ అంటే యూత్ లో యమ క్రేజ్. ఆయన సినిమా కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తారు. అయితే జనసేన పార్టీ స్థాపించిన తరువాత పవన్ పాలోయింగ్ మరింత పెరిగింది. గత ఎన్నికల్లో పవన్ పార్టీ ఓడిపోయినా… ప్రజల్లో ఉంటూ వారి సమస్యలపై పోరాడుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతూ ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా పవన్ సినిమాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. అయనా బెదరకుండా ప్రజా సమస్యలపై పోరాడుతూ వారికి అండగా ఉంటున్నారు.
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన ‘జనవాణి’ కార్యక్రమంలో భాగంగా పవన్ ఇటీవల విశాఖ వెళ్లారు. అదే సమయంలో వైసీపీ గర్జన ఏర్పాటు చేయడంతో ఇరు పార్టీల నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఆ తరువాత పవన్ ఉంటున్న హోటల్ చుట్టూ పోలీసులు చేరి ఆయనను బయటకు రానీయకుండా కట్టడి చేశారు. ఈ సమయంలో పవన్ పై కొందరు ప్యాకేజీ స్టార్ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో పవన్ రెచ్చిపోయారు. ఇక నుంచి సాదా సీదా రాజకీయాలు కాదు.. రణ రంగమే అన్నట్లు గా ఆగ్రహం వ్యక్తం చేశారు.

అప్పటి నుంచి పవన్ కు విపరీతమైన క్రేజ్ పెరిగింది. ప్రభుత్వ పనితీరును నచ్చని కొందరు పవన్ తో కలిసి నడిచేందుకు సిద్ధమవుతున్నారు. ఇతర పార్టీల్లోని కొందరు లీడర్లు జనసేనలో చేరేందుకు రెడీ అవుతున్నారు. పవన్ గత ఉప ఎన్నిక సందర్భంగా తిరుపతిలో ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పవన్ పార్టీని అక్కడ ఆదరిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఆయన తిరుపతి వెళ్లిన సందర్భంగా పవన్ చూసేందుకు భారీగా జనం గూమిగూడారు.
పవన్ తిరుపతి వచ్చిన సందర్భంగా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. గోధుమ కలర్ పంచెలో ఆయన నడుచుకుంటూ దర్శనానికి వెళ్లారు. ఆ తరువాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చుట్టూ చేరిన జనాన్ని చూసి పవన్ మరింత ఎమోషనల్ అయ్యారు. ప్రజా సమస్యల కోసం ఎన్ని అడ్డంకులు ఏర్పడినా పోరాటం ఆపేది లేదని అన్నారు. దీంతో అక్కడున్నవారంతా పవన్ మాటలకు జై కొట్టారు.