Homeఅంతర్జాతీయంRussia- North Korea: మూడవ ప్రపంచ యుద్ధం ముంచుకొస్తున్నదా?: రష్యా, ఉత్తర కొరియా ప్రపంచానికి ఏం...

Russia- North Korea: మూడవ ప్రపంచ యుద్ధం ముంచుకొస్తున్నదా?: రష్యా, ఉత్తర కొరియా ప్రపంచానికి ఏం చెబుతున్నాయి?

Russia- North Korea: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇంకా చల్లారలేదు. రేపటి నాడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇప్పటికే ఆర్థిక మాంద్యం అతలాకుతలం చేస్తోంది. ఇవీ చాలదన్నట్టు తాజాగా ఉత్తర కొరియా, అమెరికా యుద్ధ విమానాలతో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే రెండు యుద్ధాల వల్ల ప్రపంచం చాలా కోల్పోయింది. కానీ ఇప్పుడు సంకేతాలు కూడా మూడవ యుద్ధానికి దారి తీసేలా కనిపిస్తున్నాయి. ఒకవేళ గనుక అదే జరిగితే ఈ భూమి మీద మనిషి మనుగడ అనేది అత్యంత ప్రమాదకరమైన స్థితిలో పడుతుంది. ఇంతకీ అటువంటి పరిస్థితికి దారి తీసిన పరిణామాలు ఏమిటి? ఎందుకు ఆ దిశగా అడుగులు పడుతున్నాయి? ఉత్తర కొరియా, అమెరికా గత 24 గంటలుగా టర్కీ – సైప్రస్ గగనతలం మీద ఎఫ్-22 యుద్ధ విమానాలతో మాక్ డ్రిల్ చేస్తున్నాయి. గతంలో సైప్రస్ మీద విధించిన ఆంక్షలని తొలగించి టర్కీని బెదిరిస్తోంది.

Russia- North Korea
Russia- North Korea

అణు బాంబు తయారుచేయడానికి సహకరించాల్సిందిగా పాకిస్థాన్ ను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీఅభ్యర్థించారు. దీనిపై ఐక్యరాజ్యసమితి పరిశీలక బృందం దర్యాప్తు చేస్తోంది. దీంతో ఉక్రెయిన్ పై క్రూయిజ్ మిసైళ్ళ తో మళ్ళీ రష్యా విరుచుకుపడింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ని లక్ష్యంగా చేసుకొని కీలక ఇన్ఫ్రా స్ట్రక్చర్స్ ని ధ్వంసం చేసింది. మరో వైపుఅణు బాంబులని మోసుకుపోగల ఆరు బీ-52 బాంబర్ల ని ఆస్ట్రేలియాకి అమెరికా పంపింది. ఇది చైనాకి ముందస్తు హెచ్చరికగా అనుకోవచ్చా ?మూడు నెలల క్రితం ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వం తో ఉక్రెయిన్ నుంచి గోధుమలు,సన్ ఫ్లవర్ ఆయిల్, ఇతర ఆహార ధాన్యాలను నల్ల సముద్రం ద్వారా ఎగుమతి చేసుకోవడానికి రష్యా అనుమతి ఇచ్చింది. అలాంటి ఎగుమతుల మీద ఎలాంటి దాడులు చేయబోనని చెప్పింది. వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు ఆ హామీ ని వనక్కి తీసుకొని దాడులు చేస్తానని హెచ్చరిస్తున్నాడు.

ఇలా మొదలయింది

1974 లో సైప్రస్ దేశం లోని ఉత్తర భాగాన్ని టర్కీ ఆక్రమించుకుంది ! ఆ సమయంలో టర్కీ, సైప్రస్ దేశాల మధ్య చిన్నపాటి యుద్ధం జరిగినది. కానీ పరిణామంలో పెద్దది, నాటో లో సభ్యురాలిగా ఉన్న టర్కీ ని ఎదుర్కోలేక పోయింది సైప్రస్. కానీ అమెరికా ఆయుధాలు సరఫరా చేస్తూ వచ్చింది సైప్రస్ కి కానీ టర్కీ అభ్యంతరం పెట్టడం వల్ల 1987 లో సైప్రస్ కి ఆయుధాలు అమ్మడం మీద ఆంక్షలు విధించింది అమెరికా. నాలుగేళ్లుగా టర్కీ తో అమెరికా సంబంధాలు క్రమంగా క్షీణిస్తూ వచ్చాయి. పాకిస్థాన్,చైనా,రష్యాలతో టర్కీ సన్నిహిత సంబంధాలని నెరపడం నాటో సభ్య దేశం అయిన టర్కీ తో అమెరికా విభేదాలు తీవ్రస్థాయిలోకి వెళ్లిపోయాయి. మూడేళ్ళ క్రితం టర్కీ రష్యా నుంచి ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొన్నది అమెరికా అభ్యంతరాలను లెక్క చేయకుండా దాంతో ఎఫ్-35 ప్రోగ్రామ్ లో భాగస్వామి గా ఉన్న టర్కీ ని అమెరికా తొలగించింది. గత సంవత్సరం టర్కీ ని ఎఫ్ ఏ టీ ఎఫ్ గ్రే లిస్ట్ లో పె ట్టించింది. తాజాగా టర్కీ శత్రు దేశం అయిన సైప్రస్ దేశం మీద ఉన్న ఆయుధ సరఫరా ఆంక్షలని ఎత్తివేసింది. ఆంక్షలు ఎత్తివేసిన రెండు వారాల తరువాత మూడు రోజుల 1974 లో టర్కీ ఆక్రమించిన సైప్రస్ దేశానికి చెందిన భూభాగం అయిన ఫామగుస్తా ఎయిర్ స్పేస్ మీద ఎఫ్-22 రాప్టర్ యుద్ధ విమానాలతో విన్యాసాలు చేసినట్లు గ్రీక్ మీడియా వెల్లడించింది. విచిత్రం ఏమిటంటే ఎఫ్-22 రాప్టార్ లని టర్కీ ఆక్రమిత ఎయిర్ స్పేస్ మీద ఉపయోగించడం ఆశ్చర్యం కలిగించింది ! ఎందుకంటే విదేశాలలో ఇంతవరకు ఎఫ్-22 రాప్టార్ లను లని ఉపయోగించలేదు. అమెరికన్ ఎయిర్ ఫోర్స్ ఇదే మొదటిసారి ఇలా విన్యాసాలు చేయడం ! బహుశా రష్యన్ ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ టర్కీ దగ్గర ఉండడం ప్రధాన కారణం కావొచ్చు. రష్యన్ ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ స్టెల్త్ ఫైటర్ అయిన ఎఫ్-22 రాప్టార్ ని డిటెక్ట్ చేయగలదా లేదా అనే విషయాన్ని ధృవ పరచుకోవడానికే ఈ విన్యాసాలు చేసి ఉండవచ్చు . రష్యా మాత్రం తమ ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎఫ్-22 రాప్టార్ లని కూడా డిటెక్ట్ చేసే మిసైల్ దాడి చేయగలదు అంటూ చెప్పుకొస్తున్నది. ఈ విషయ ప్రస్తావన ఎందుకంటే ఎఫ్-22 రాప్టార్ రాడార్ డాటా ని మన దేశంతో అమెరికా కనుక పంచుకుంటే అప్పుడు ఎఫ్-22 రాప్టార్ కి కాపీ అయిన చైనా జే-20 స్టెల్త్ ఫైటర్ ని ఎలా మేనేజ్ చేయాలో మనకి తెలిసిపోతుంది. కాకపోతే తన ఎఫ్_22 రాప్టార్ రాడార్ డాటా ని మనతో పంచుకుంటుందా అమెరికా అనేదే ప్రశ్న! ఎఫ్-22 రాప్టార్ లో ఉన్న పవర్ ఫుల్ రాడార్ ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో కలిసి పనిచేసే సెర్చ్ రాడార్ సిగ్నల్స్ ని రికార్డ్ చేయగలదు. అదే సమయంలో ఎస్-400 ఎఫ్-22 రాప్టార్ ని గుర్తించిందా లేదా అన్నది తెలుస్కోవచ్చు..

దాడి చేసి వెళ్ళింది

రెండేళ్ల క్రితం సిరియాలో దాడి చేయడానికి వచ్చిన ఇజ్రాయెల్ ఎఫ్-35 ఫైటర్ జెట్ ఎస్_400 పరిధిలో ఉన్న ప్రాంతం మీద దాడి చేసి వెళ్ళిపోయింది. రష్యా నుంచి వచ్చిన ఆదేశాలతో సిరియాలో ఉన్న ఎస్-400 సిస్టమ్ ని తాత్కాలికంగా ఆపేశారు ఆపరేటర్లు. సిరియా దాడి చేసి వెళ్ళిపోయిన తరువాత మళ్ళీ ఎస్-400 ని యాక్టివేట్ చేశారు ఆపరేటర్లు అంటే ఎస్-400 ఇజ్రాయెల్ ఎఫ్-35 ని డిటెక్ట్ చేసి ఉండవచ్చు అది చాలా దూరంలో ఉండగానే కానీ ఇజ్రాయెల్ ఫైటర్ జెట్ లని కూల్చాలా వద్దా అనే సందేహంతో వెంటనే రష్యా లో ఉన్న కమాండ్ ని సంప్రదించారు ఆపరేటర్స్. దాంతో కమాండ్ సెంటర్ నుండి వచ్చిన ఆదేశాల వల్ల తాత్కాలికంగా ఎస్-400 ని స్విచ్ ఆఫ్ చేశారు సిరియాలోని ఆపరేటర్లు. రష్యా లో కమాండ్ సెంటర్ ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ ఎఫ్-35 ని చూస్తూ ఎందుకు వదిలేశారన్నది ఇక్కడ ప్రశ్న. ఇందుకు కారణాలు లేకపోలేదు. రష్యా, ఇజ్రాయెల్ తో మంచి సంబంధాలని కొనసాగించాలి అనే ఉద్దేశ్యంతో ఉంది కాబట్టి స్విచ్ ఆఫ్ చేయమని ఆదేశాలు ఇచ్చారు.

అమెరికన్ ఎఫ్-35 కావొచ్చు లేదా ఎఫ్-16 లు కావొచ్చు ఇజ్రాయెల్ దిగుమతి చేసుకున్నాక వాటిలో తమ ఎలక్ట్రానిక్స్ ను అమరుస్తుంది. వాటిలో మరీ ముఖ్యంగా ఎయిర్ డిఫెన్స్ రాడార్ ల సిగ్నల్స్ ని రికార్డ్ చేసే సౌకర్యం ఉంది. తిరిగి వెళ్ళిన తరువాత ఇజ్రాయెల్ సైంటిస్టులు ఎయిర్ డిఫెన్స్ రాడార్ ఎలాంటి బాండ్ ని వాడుతూ ఎలాంటి ఫ్రీక్వెన్సీ లని ప్రసారం చేసింది అన్నది తెలుసుకుంటారు. ఇలా రెండు మూడు సార్లు జరిగాక మొత్తం డాటా ని విశ్లేషించి తరువాతి దాడిలో ఎలాంటి ఫ్రీక్వెన్సీ లని జామ్ చేసి ఆయా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని ధ్వంసం చేయవచ్చో ఒక ప్లాన్ సిద్ధం చేసి పైలట్ లకి ఇస్తారు సైంటిస్టులు.

ఇలాంటి అవకాశం ఇజ్రాయెల్ కి ఇవ్వకూడదు అనే ఉద్దేశ్యం తో ముందు జాగ్రత్తగా రష్యన్ కమాండ్ స్విచ్ ఆఫ్ చేయమని ఆదేశాలు ఇచ్చింది !
ఎప్పుడో 1974 లో టర్కీ సైప్రస్ భూభాగాన్ని ఆక్రమించుకున్నది కానీ అప్పట్లో అమెరికా తో పాటు మిగతా నాటో దేశాలు అభ్యంతరపెట్టలేదు. ఎందుకంటే టర్కీ కూడా నాటో లో భాగంగా ఉంది కానీ 38 ఏళ్ల తరువాత అదీ టర్కీ కోసం సైప్రస్ మీద ఆంక్షలు విధించిన అమెరికా ఇప్పుడు ఆ ఆంక్షలని తొలగించి స్వేచ్ఛగా తన ఆయుధాలని సైప్రస్ కి అమ్మడం కోసమేనా ? లేక టర్కీ మీద పరోక్షంగా యుద్ధం ప్రకటించడం అనుకోవాలా ? మరి టర్కీ ని నాటో నుంచి ఎందుకు తొలగించలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Russia- North Korea
Russia- North Korea

ఒక పక్క తైవాన్, చైనాల మధ్య మరో పక్క రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధ వాతావరణం లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. టర్కీ, సైప్రస్ ల మధ్య కొత్తగా చిచ్చు పెట్టి టర్కీ ఆక్రమించుకున్న భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోమని సైప్రస్ ని రెచ్చగొట్టి మరో యుద్ధానికి తెరతీయడానికి గల కారణం ఏమిటి ? దాని కోసం ఎఫ్_22 రాప్టార్ లని ఉపయోగించడం సైప్రస్ కి నైతిక మద్దతు ఇవ్వడానికా ? టర్కీ సైప్రస్ ల మధ్య ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి సైప్రస్ చేత ఆయుధాలు కొనిపించి ఆపై మౌనంగా ఉంటుందా అమెరికా ? లేక నిజంగానె సైప్రస్ చేత యుద్ధం చేయించి తాను తోడుగా ఉంటుందా ? ఇలా చాలా ప్రశ్నలు ఉన్నాయి కానీ సమాధానాలు ఇచ్చేవారు లేరు.

టర్కీ పరోక్షంగా రష్యాకి మద్దతు ఇస్తున్నట్లు ఇటీవలే ఒక సంఘటన వెలుగు చూసింది. రష్యా ఉక్రెయిన్ ల మధ్య జరుగుతున్న యుద్ధ వార్తలని కవర్ చేస్తున్న ఉక్రెయిన్ జర్నలిస్ట్ అయిన ఒక మహిళ ని టర్కీ లో అరెస్ట్ చేయమని పుతిన్ అడిగాడు. దానికి ప్రతిస్పందించిన టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ పుతిన్ అడిగిన మహిళా జర్నలిస్ట్ ని నిర్భంధంలోకి తీసుకున్నాడు కానీ ఆ మహిళా జర్నలిస్ట్ ని రష్యా కి అప్పచెప్పాడా లేదా అన్నది తెలియరాలేదు కానీ ఈ చర్య అమెరికాకి ఆగ్రహం కలిగించి ఉండవచ్చు దానికి ప్రతిగా సైప్రస్ మీద ఆంక్షలు ఎత్తివేసి ఆయుధాలు కొనడానికి మార్గం సుగమం చేసింది అనుకోవచ్చు. ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ యుద్దం వల్ల ప్రపంచం అతలాకుతలమవుతోంది. తాజా యుద్ద సంకేతాలతో ఏమవుతుందోనన్న ఆందోళన ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular