నివర్ తుఫాన్ వల్ల రైతులు పెద్ద ఎత్తున నష్టపోయింది వాస్తవమే. కానీ.. ఇన్ని రోజులు అడపాదడపా స్పందించి.. ఇప్పుడు ఒకేసారి పవన్ కల్యాణ్ ఆందోళనబాట ఎందుకు పట్టినట్లు..? ఇన్ని డ్రామాలు ఆడాల్సిన అవసరం ఎందుకు వచ్చినట్లు..? రైతులకు పంట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న పవన్‌కు.. ఆల్‌రెడీ అధికారులు పంట నష్టం అంచనా వేసే పనిలో ఉన్నారనే విషయం తెలియదా..? ఇది స్వయంగా రాష్ట్ర సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు కదా..!
Also Read: బ్రేకింగ్: స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు
ఈ సర్వే తాలుకు నివేదికలు డిసెంబర్ 15వ తేదీలోగా అధికారులు ప్రభుత్వానికి అందించాలి. ఆ తర్వాత డిసెంబర్ 30వ తేదీకి రైతులందరికీ పరిహారం అందుతుందని జగన్ చాలా స్పష్టంగా ప్రకటించారు. అసెంబ్లీలో చెప్పిన ప్రకారమే పరిహారం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఈ విషయం తెలిసిన తర్వాతే పవన్ కావాలనే పెద్ద షో చేసినట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రైతు సమస్యలు పరిహారం చెల్లింపు విషయంలో కృష్ణా జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేపేరుతో పవన్ ఉయ్యూరు, గుడివాడ ప్రాంతాల్లో రోడ్డుషో చేసిన విషయం తెలిసిందే.
రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి రాయితీ వైఎస్సార్ రైతు భరోసా నిధులు విడుదల చేయటానికి ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసేసింది. నివర్ తుపాను కారణంతో నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ వైఎస్సార్ రైతుభరోసా పీఎం కిసాన్ మూడోవిడత నిధుల కోసం రూ.1,766 కోట్లను రెడీ చేసింది. రైతు భరోసా కింద 52 లక్షల రైతు కుటుంబాలకు రూ.22 వేలు చొప్పున చెల్లించేందుకు రూ.1,120 కోట్లు కేటాయించింది. అలాగే పీఎం కిసాన్ మూడో విడత చెల్లింపులను ప్రధానమంత్రి ఈనెల 25న విడుదల చేశారు. ఇప్పటికే కొందరు రైతుల ఖాతాల్లో రూ.2 వేలు జమయ్యాయి. మిగిలిన రైతులకు రాష్ట్రప్రభుత్వం రైతుభరోసా పథకంలో రూ.2 వేలు జమచేయబోతోంది. ఇక నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతుల కోసం రూ.646 కోట్లు కేటాయించింది. అధికారుల లెక్కల ప్రకారం 12 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. దీనివల్ల 8.44 లక్షల మంది రైతులు నష్టపోయారు.
Also Read: పవన్‌పై వైసీపీ ఎదురుదాడి
ఈ మూడు పద్ధతుల్లో రైతుల ఖాతాల్లో మంగళవారమే డబ్బులు జమ అయ్యేట్లుగా ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేసింది. ఈ విషయం తెలిసిన తర్వాతే పవన్ కావాలనే పెద్ద షో చేసినట్లు వైసీపీ నేతలంటున్నారు. నిజంగానే పవన్ కు రైతులపై అంతటి ప్రేమే ఉంటే నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు కేంద్రం నుండి రావాల్సిన పరిహారాన్ని ఎందుకు డిమాండ్ చేయటం లేదని నిలదీస్తున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్