- Telugu News » Ap » Nandam sabbayyadi is a government assassin babu
నందం సబ్బయ్యది ప్రభుత్వ హత్యే: చంద్రబాబు
కడప జిల్లాలోని నందం సుబ్బయ్యను ప్రభుత్వమే హత్యేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మంగళవారం ఉదయం కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్యకు గురైన విషయం తెలిసింది. ఈ సంఘటనపై తీవ్రంగా ఖండిస్తున్నామని చంద్రబాబు అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నేరగాళ్లు పెరిగిపోయారన్నారు. వైసీపీ ఎమ్మెల్యే అవినీతిని బట్టబయలు చేశాడన్న అక్కసుతోనే ఆయనను కిరాతకంగా హత్య చేయించారని అన్నారు. వైసీపీ అవినీతిని భయటపెట్టిన ప్రాణాలను తీయడం హేయమైన చర్య అని అన్నారు. […]
Written By:
, Updated On : December 29, 2020 / 01:55 PM IST

కడప జిల్లాలోని నందం సుబ్బయ్యను ప్రభుత్వమే హత్యేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మంగళవారం ఉదయం కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్యకు గురైన విషయం తెలిసింది. ఈ సంఘటనపై తీవ్రంగా ఖండిస్తున్నామని చంద్రబాబు అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నేరగాళ్లు పెరిగిపోయారన్నారు. వైసీపీ ఎమ్మెల్యే అవినీతిని బట్టబయలు చేశాడన్న అక్కసుతోనే ఆయనను కిరాతకంగా హత్య చేయించారని అన్నారు. వైసీపీ అవినీతిని భయటపెట్టిన ప్రాణాలను తీయడం హేయమైన చర్య అని అన్నారు. నిందితులను శిక్షించి సుబ్బయ్య కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.