సంక్షేమ పథకాల్లో దేశంలోనే టాప్ ప్లేస్‌లో దూసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులు సైతం వేధిస్తున్నాయి. అక్కడి సర్కార్ పరిమితికి మించి అప్పులు చేస్తున్నట్లుగా ఇప్పటికే ‘కాగ్’ నివేదికలో కడిగేసింది. సంక్షేమ పథకాల కోసం అప్పులు చేస్తున్నారు సరే.. కానీ.. ఆ అప్పులకు తగ్గట్లుగా రాష్ట్ర ఆదాయం పెరుగుతోందా అనేది కూడా చూడాలి కదా..! ఆదాయం ఉంటేనే కదా చేసిన అప్పులు తిరిగి చెల్లించే సామర్థ్యం పెరుగుతుంది. ఏపీ సర్కార్ చేస్తున్న అప్పులు అన్నీ అనుత్పాదక వ్యయానికే ఖర్చు పెడుతున్నట్లుగా నిపుణులు అంటున్నారు.
Also Read: విశాఖకు కమాండ్ కంట్రోల్ సెంటర్ షిఫ్ట్
ఈ ఆర్థిక సంవత్సరంలో 10 నెలలకు తీసుకున్న అప్పు రూ.73, 913 కోట్లు. బడ్జెట్లో ఏడాది మొత్తం చేస్తామని చెప్పిన అప్పు రూ.48,295 కోట్లు. అంటే రెవెన్యూ లోటు రూ.54,046 కోట్లకు చేరింది. అంటే ఆదాయానికి.. ఖర్చులకు మధ్య అంతరం అన్నమాట. ఇంత మొత్తం పూడ్చుకోవడం అసాధ్యం. అందుకే అధిక వడ్డీలకు ఆర్బీఐ దగ్గర వేస్ అడ్ మీన్స్ తో పాటు ఓవర్ డ్రాఫ్ట్‌ను కూడా ఉపయోగించుకుంటోంది. ఆదాయ వనరులను పెంచుకునేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దశ..దిశా లేని ఆర్థిక వ్యవహారం వల్ల మొత్తానికే పరిస్థితి దిగజారిపోతోందని నిపుణులు అంటున్నారు.
రెండు నెలల్లో మరో పది వేలో.. పదిహేను వేల కోట్లో అప్పులు చేస్తారు. అలా చేస్తేనే.. జీతాలతోపాటు ఏడాది చివరిలో చెల్లింపులు చేయాల్సినవి చేయగలుగుతారు. లేకపోతే ఇబ్బంది పడతారు. వచ్చే ఏడాది మార్చి నుంచి మళ్లీ కొత్త అప్పులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ.. చేసిన అప్పులకు చెల్లించాల్సిన కిస్తీలు కూడా పెరుగుతాయి. ఇప్పుడు ఏపీ సర్కార్ ను ఇదే ఆందోళనకు గురి చేస్తోంది. అప్పుల వాయిదాలు చెల్లింపులు చేయకపోతే దివాలా కింద పరిగణిస్తారు. అలాంటి పరిస్థితి రానీయకుండా ఇప్పుడు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఈ ఒత్తిడి తట్టుకోలేకనేమో.. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సెలవు పెట్టి వెళ్లిపోయారు.
Also Read: జగన్ కూతుళ్లు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?
మొత్తంగా ఓ వైపు రాష్ట్రంలో వినూత్న పద్ధతిలో పథకాలు అమలుచేస్తున్నా.. మరో వైపు పెరుగుతున్న అప్పులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. మళ్లీ బడ్జెట్ పెట్టే సమయం ఆసన్నం కూడా అయింది. ఇప్పటికే అప్పుల కుప్పయిన రాష్ట్రాన్ని ఎలా బయటపడేస్తారా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. మరోవైపు.. వైసీపీ నేతలు మాత్రం తమ నాయకుడు జగన్ లెక్కలు జగన్‌కు ఉన్నాయని భరోసాతో చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Is there wealth in ap to debt
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com