వైసీపీలో బొత్సకు ప్రాధాన్యం లేదా?

వైసీపీలో కొందరిని కావాలనే దూరం పెడుతున్నారు. మంత్రి అయినా సరే వారికి ఏం తెలియకుండా చేస్తూ నవ్వుల పాలు చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే పదవిలో ఉన్నా సరే సరైన సమాచారం ఇవ్వకుండా అభాసుపాలు చేస్తున్నారు. వైసీపీలో సీనియర్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఈ మధ్య సర్కారు ఆదేశాలను చెబుతున్నా అందులో నిజం లేదని తెలుస్తోంది. మొదట బొత్సతో ప్రకటన చేయించి తరువాత సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ వేయడంతో ఆయనపై విశ్వాసం పోతున్నట్లుగా […]

Written By: Srinivas, Updated On : August 4, 2021 12:24 pm
Follow us on

వైసీపీలో కొందరిని కావాలనే దూరం పెడుతున్నారు. మంత్రి అయినా సరే వారికి ఏం తెలియకుండా చేస్తూ నవ్వుల పాలు చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే పదవిలో ఉన్నా సరే సరైన సమాచారం ఇవ్వకుండా అభాసుపాలు చేస్తున్నారు. వైసీపీలో సీనియర్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఈ మధ్య సర్కారు ఆదేశాలను చెబుతున్నా అందులో నిజం లేదని తెలుస్తోంది. మొదట బొత్సతో ప్రకటన చేయించి తరువాత సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ వేయడంతో ఆయనపై విశ్వాసం పోతున్నట్లుగా కనిపిస్తోంది. ఆయనకు ఏం తెలియదని చెప్పేందుకే ఆయనతో విరుద్ధమైన ప్రకటనలు ఇప్పిస్తున్నారని సమాచారం.

తాజాగా అమరరాజా సంస్థ విషయంలో కూడా ఇదే జరిగింది. బొత్స సదరు సంస్థ లాభాలొచ్చే చోటుకు వెళ్లిపోతోందని చెప్పించారు. తరువాత సజ్జల కంపెనీని తామే వెళ్లిపొమ్మామని ప్రకటించారు. దీంతో బొత్స మధ్య బఫూన్ గా మిగిలిపోయారు. వీటిని చూస్తుంటే కావాలనే బొత్సను జోకర్ గా చిత్రీకరించేందుకే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో బొత్సపై రాజకీయ కుట్ర జరుగుతోందనే ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. బొత్స ఒక తీరుగా సజ్జల మరో తీరుగా మాట్లాడడంలో ఆంతర్యమేమిటని అందరు ప్రశ్నిస్తున్నారు.

బొత్స సత్యనారాయణ పరిస్థితి అధ్వానంగా మారింది. పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడంతో ప్రాధాన్యం కరువైంది. ఆయన మంత్రిత్వ శాఖపై కూడా ఆయనకు స్వేచ్ఛ లేకుండా పోతోంది. సమక్షలు కూడా నిర్వహించకుండా చేస్తున్నారని తెలుస్తోంది. ఏదైనా విషయంపై తెలిపేందుకు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం తప్ప మరేం చేయకుండా అడ్డుకుంటున్నారు. బొత్సను రాజకీయంగా దెబ్బతీసేందుకు వ్యూహాత్మకంగా ప్రవర్తిస్తున్నారని సమాచారం. అయితే దీన్ని ఎదుర్కోవడం బొత్స వల్ల కూడా కావడం లేదు. అందుకే ఆన్ని చోట్ల నవ్వులపాలవుతూ తన రాజకీయ భవిష్యత్తును చేజార్చుకుంటున్నారు.

బొత్స సత్యనారాయణ ఇన్నాళ్లు వైసీపీలో కీలక వ్యక్తిగా ఉన్నా ప్రస్తుతం ఆయన ఉనికికే ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. పార్టీలో మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నా ప్రస్తుతం ఆయన మాటలు చెల్లుబాటు కావడం లేదు. కావాలనే ఆయనతో తప్పుడు సమాచారం ఇచ్చి చెప్పించి తరువాత దాన్ని దాటేసే విధంగా మార్చడంపై ఇదో రాజకీయ నాటకంగా భావిస్తున్నారు. బొత్సను పార్టీ నుంచి పంపేయాలని నిర్ణయించుకున్నట్లు పలువురు గుసగుసలాడుతున్నారు.