అయితే, రాజ్ కుంద్రా అరెస్ట్.. శిల్పాశెట్టికి ఆమె ఫ్యామిలీకి పెద్ద నష్టల్నే మిగిల్చింది. ఒకపక్క నెటిజన్లు ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దీనికితోడు భర్త అరెస్ట్ ఎఫెక్ట్ శిల్పాశెట్టి కెరీర్ పై, ఆమె చేస్తోన్న పలు ప్రాజెక్టులు పై బాగా పడింది. ఆమెకు వచ్చిన ఛాన్స్ లు కూడా మిస్ అవుతున్నాయి. ఇప్పటికే శిల్పా కోట్లలో నష్టపోయిందని వార్తలు వస్తున్నాయి.
ముఖ్యంగా హిందీ బుల్లితెర పై ప్రసారమయ్యే ఓ డ్యాన్స్ షోకి శిల్పా జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సుమారు ఈ షో ఒక్కో ఎపిసోడ్ కి శిల్పా శెట్టి రూ.20 నుంచి 22 లక్షల వరకు రెమ్యునరేషన్ గా పట్టుకుంటుందట. భర్త అరెస్ట్ తర్వాత, ఈ షో యాజమాన్యం ఆమెను తప్పించింది. మరోవైపు ఇప్పట్లో రాజ్‌కుంద్రా కేసు ఓ కొలిక్కి వచ్చేలా లేదు.
దీంతో ఈ డ్యాన్స్ షోలో శిల్పాశెట్టిని తొలిగించాలని నిర్వాహకులు ఆలోచనలో ఉన్నారట. అలాగే శిల్పా శెట్టికి, మహేష్ – త్రివిక్రమ్ సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటించే అవకాశం వచ్చింది. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ టీం ఆమెను తీసుకునే ఆలోచనలో లేరని తెలుస్తోంది. త్వరలోనే ఆమె స్థానంలో మరో నటిని ఫైనల్ చేయనున్నారు.