https://oktelugu.com/

జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం లేదా?

భారత రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి వందలయేళ్ల చరిత్ర ఉంది. దేశాన్ని అత్యధిక పాలించింది కూడా కాంగ్రెస్ పార్టీనే. ఎన్నో అటుపోట్లను ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ ఇప్పుడు గల్లీ స్థాయికి పడిపోగా రెండు సీట్లతో ప్రస్థానం ప్రారంభించిన బీజేపీ మాత్రం జాతీయ స్థాయిలో తిరుగులేని శక్తిగా మారుతోంది. Also Read: బ్యాంక్ అకౌంట్ తో ఆధార్ లింక్ చేశారా.. లేదంటే లక్షల్లో నష్టం..? మోడీ-అమీత్ షా నేతృత్వంలో బీజేపీ రెండుసార్లు కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 11, 2020 / 03:06 PM IST
    Follow us on

    భారత రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి వందలయేళ్ల చరిత్ర ఉంది. దేశాన్ని అత్యధిక పాలించింది కూడా కాంగ్రెస్ పార్టీనే. ఎన్నో అటుపోట్లను ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ ఇప్పుడు గల్లీ స్థాయికి పడిపోగా రెండు సీట్లతో ప్రస్థానం ప్రారంభించిన బీజేపీ మాత్రం జాతీయ స్థాయిలో తిరుగులేని శక్తిగా మారుతోంది.

    Also Read: బ్యాంక్ అకౌంట్ తో ఆధార్ లింక్ చేశారా.. లేదంటే లక్షల్లో నష్టం..?

    మోడీ-అమీత్ షా నేతృత్వంలో బీజేపీ రెండుసార్లు కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ రెండు పర్యాయాలు అధికారానికి దూరంకావడంతో నేతలంతా ఇతర పార్టీల్లోకి వెళుతుండటంతో ఆ పార్టీ క్రమంగా బలహీన పడుతోంది. ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విపక్షాలతో కలిసి బీజేపీ ఎదుర్కొనేందుకు ప్రయత్నించిన సాధ్యం కావడం లేదు.

    తాజాగా జరిగిన బీహార్ ఎన్నికల్లోనూ ఇది స్పష్టమైంది. బీజేపీకి ప్రత్నామ్నాయంగా విపక్షాలన్నీ మహాకూటమిగా పోటీ చేశాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా మహాకూటమి గెలుస్తుందని ఎన్డీఏ కూటమి ఓడిపోతుందని తేల్చిచెప్పాయి. అయితే రిజల్ట్ మాత్రం బీజేపీ కూటమికే అనుకూలంగా వచ్చింది. ఇది విపక్షాల కూటమికి మింగుపడటం లేదు.

    Also Read: బీహార్ ఫలితం ఏయే రాష్ట్రాలపై ప్రభావం చూపనుంది..?

    ఒక్క బీహార్లోనే కాకుండా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలు జట్టుగా బీజేపీపై పోటీ చేశాయి. ఎక్కడా కూడా మహాకూటమి విజయం సాధించలేదు. దీంతో జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం లేదని టాక్ విన్పిస్తోంది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

    ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీజేపీ ఉత్తరాదితోపాటు దక్షిణాదిలోనూ విజయం సాధించి విపక్షాలకు సవాల్ విసిరింది. జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీలన్నీంటిని ఏకం చేస్తే తప్ప రానున్న రోజుల్లో మోడీని ఎదుర్కొవడం కష్టమేనని అభిప్రాయం విపక్ష పార్టీల్లో వ్యక్తమవుతోంది.