బెహ్రయిన్ ప్రధాన మంత్రి షేక్ ఖలిఫా బిన్ సల్మాన్ అల్ ఖలిఫా మరణించారు. ఈ మేరకు ఆయన మరణ విషయన్ని రాజభవనం ట్విట్టర్ ద్వారా ధృ వీకరించింది. 1970 నుంచి ఖలీఫా ప్రధానిగా కొనసాగుతున్నారు. 1971, ఆగస్టు 15వ తేదీన ఆ దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ప్రపంచంలో సుధీర్ఘకాలంగా పనిచేసిన ప్రధానిగా ఖలీఫా రికార్డు సృష్టించాడు . 2011లో వచ్చిన అరబ్ విప్లవంలో ఆయన ప్రభుత్వాన్ని కాపాడుకోగలిగారు. కాగా అమెరికాలో ఆయన కన్నుమూసినట్లు బెహ్రయిన్ రాజభవనం తెలిపింది. వారం రోజుల పాటు ఆ దేశంలో సంతాప దినాలు ప్రకటించారు. పార్థీవ దేహం వచ్చిన తరువాత ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆ దేశ ప్రభుత్వం తెలిపింది.