దుబ్బాక ఎన్నికతో చంద్రబాబు కదలిక..!

దుబ్బాక ఉప ఎన్నిక జరగడం ఏమో గానీ తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలను మలుపు తిప్పుతోంది. ఇక్కడ స్వల్ప మెజారిటీతో గెలిచినా తెలంగాణలో బీజేపీ కి ఎనలేని క్రేజ్ వచ్చింది. తెలంగాణలో ఇప్పటి వరకు బీజేపీకి ఒక్క సీటు మాత్రమే ఉంది. దుబ్బాకలో గెలిచిన సీటుతో ఆ పార్టీకి రెండు మాత్రమే ఉంటాయి. కానీ దుబ్బాకలో బీజేపీ గెలుపొందడంతో రాష్ట్ర రాజకీయాలను ఒక్క కుదుపు కుదిపేసింది. తాజాగా దుబ్బాక ఎన్నికను పరిశీలించిన టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త ఆలోచనలో […]

Written By: NARESH, Updated On : November 11, 2020 3:57 pm

chandrababu bjp

Follow us on

దుబ్బాక ఉప ఎన్నిక జరగడం ఏమో గానీ తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలను మలుపు తిప్పుతోంది. ఇక్కడ స్వల్ప మెజారిటీతో గెలిచినా తెలంగాణలో బీజేపీ కి ఎనలేని క్రేజ్ వచ్చింది. తెలంగాణలో ఇప్పటి వరకు బీజేపీకి ఒక్క సీటు మాత్రమే ఉంది. దుబ్బాకలో గెలిచిన సీటుతో ఆ పార్టీకి రెండు మాత్రమే ఉంటాయి. కానీ దుబ్బాకలో బీజేపీ గెలుపొందడంతో రాష్ట్ర రాజకీయాలను ఒక్క కుదుపు కుదిపేసింది. తాజాగా దుబ్బాక ఎన్నికను పరిశీలించిన టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ ఫాంలోకి రావడంతో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలా..? అని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Also Read: రఘునందన్ పై కేసీఆర్ బ్రహ్మస్త్రం పనిచేయలేదా..?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత చంద్రబాబు మళ్లీ ఆ రాష్ట్రం వైపు చూడలేదు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చినా తెలంగాణ గురించి పట్టించుకోలేదు. అయితే 2019 ఆంధ్రప్రదేశ్ లోనూ ఓడిపోవడంతో కనీసం సమావేశాలు కూడా నిర్వహించడానికి సమయాన్ని కేటాయించలేదని సమాచారం. దీంతో పెద్ద, చిన్నా నాయకులెవరు లేకుండా టీడీపీ నుంచి ఇతర పార్టీల్లోకి మారారు. ప్రస్తతం తెలంగాణలో అధ్యక్షుడు రమణ తప్ప చెప్పుకోవడానికి నాయకుడే లేరు.

Also Read: ‘దుబ్బాక’ఫలితంపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు..

హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికలు త్వరలో జరిగే అవకాశం ఉంది. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా సీట్లు వచ్చాయి. టీఆర్ఎస్ వచ్చిన తరువాత కూడా కొన్ని స్థానాల్లో పాగా వేసింది. అయిదే గెలిచిన వారు సైతం టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి మారారు. దీంతో 2016 ఎన్నికల్లో టీడీపీకి ఒకటి, అర సీట్లు మాత్రమే దక్కాయి. ఇక 2018 ఎన్నికల్లో ఒక్కటి మాత్రమే గెలుచుకోవడంతో ఎంపీ ఎన్నికల్లో పోటీకి నిరాకరించింది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

తాజాగా తెలంగాణలో బీజేపీ దూకుడును చూసిన టీడీపీ అధినేత బీజేపీతో కలిసి వెళితే ఎలా ఉంటుందన్న ఆలోచనలో పడ్డాడట. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంతో కాలం లేవు. ప్రస్తుతం  బీజేపీ ఇంకా పుంజుకునే స్థాయిలోనే ఉంది. దీంతో అన్ని స్థానాల్లో బీజేపీకి కలిసి వస్తుందని అనుకోలేము. ఈ తరుణంలో జాతీయ పార్టీగా పేరున్న టీడీపీతో జత కడితే బెటరని ఆ పార్టీ నాయకులు కూడా కార్యాచరణను రూపొందిస్తున్నారు. అయితే చంద్రబాబు తెలంగాణ బీజేపీతో కలిసి వెళ్తాడా..? చూద్దాం..