Janasena and BJP: ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ఉప ఎన్నికల పోరు మొదలుకానుంది. ఇప్పటికే బద్వేల్ ఉప ఎన్నిక పూర్తి కాగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. నెల్లూరు కార్పొరేషన్ తోపాటు 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని 54 డివిజన్లు, 353 వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు శ్రీకారం చుట్టబోతోంది. అధికార పార్టీ దూకుడులో ప్రతిపక్షాలు నిలబడటం కష్టమే అయినా పరువు నిలుపుకునే క్రమంలో పోటీకి సై అనక తప్పని పరిస్థితి. దీంతో రాష్ర్టంలో స్థానిక పోరులో సైతం వైసీపీ క్లీన్ స్వీప్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు 14 జెడ్పీటీసీ స్థానాలు, 176 ఎంపీటీసీ స్థానాలు, 69 సర్పంచ్, 533 వార్డులకు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది. బుధవారం నుంచి శుక్రవారం వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం కల్పించింది. దీంతో మళ్లీ ఏపీలో ఎన్నికల కోలాహలం ఏర్పడనుంది. అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.
బద్వేల్ ఎన్నికలో ఏకపక్ష విజయం నమోదు చేసిన వైసీపీ స్థానిక ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. దీని కోసం కార్యకర్తలను తయారు చేస్తోంది. ఏపీలో మరోమారు విజయఢంకా మోగించాలని చూస్తోంది. దీని కోసం అన్ని ఏర్పాట్లు కూడా రెడీ చేసుకుంటోంది. ఇందులో భాగంగా నేతలకు సూచనలు ఇస్తోంది.
Also Read: Modi Hindutva: హిందువుల హృదయ సామ్రాట్ గా నరేంద్ర మోడీ
ఇక రాష్ర్టంలో పొత్తుల విషయం మాత్రం తేలడం లేదు. జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఈ పొత్తులతో ఇరు పార్టీలు నష్టపోయామని భావిస్తున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ, జనసేన మధ్య సీట్ల విషయం ఇంకా తేలలేదు. అసలు పొత్తు ఉంటుందా? లేదా అనేది కూడా ప్రకటించాల్సి ఉంది. దీనికి ఇరు పార్టీల నేతలు ఏం మాట్లాడటం లేదు.
Also Read: Pawan Kalyan: జనసైనికులను బెదిరిస్తారా? మూడు రాజధానులు అసాధ్యం.. వైసీపీపై పవన్ ఫైర్