మూడుసార్లు గెలిచిన అహంకారం ఒకవైపు.. పదవి ఉందని, ఏం చేసినా చెల్లుతుందనే అహంకారం ఇంకోవైపు.. డబ్బులు పడేస్తే ఓటర్లు చచ్చుకుంటూ ఓటేస్తారన్న ఆలోచనతో అమాత్యుడి హోదాలో గంగుల కమలాకర్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న అపవాదు ఉంది.
జాతీయస్థాయిలో బిజెపి, కాంగ్రెస్ వైరి వర్గాలుగా ఉన్నాయి. దశాబ్దాల వైరం వారిది. ఈ తరుణంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకూడదు అన్నది బిజెపి అభిప్రాయం.
తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న తన పార్టీని భారత రాష్ట్ర సమితిగా కేసీఆర్ మార్చారు. ఏపీ తో పాటు ఒడిశా, మహారాష్ట్రలో పార్టీని విస్తరించాలని చూశారు. కొంతమంది నేతలను సైతం పార్టీలో చేర్చుకున్నారు.
ముఖ్యంగా టిడిపి జనసేన మధ్య పొత్తు చిగురించింది ఈ ఏడాదిలోనే. ఎప్పటి నుంచో ఆ రెండు పార్టీల మధ్య సయోధ్య ఉంది. ఎన్నికల ముంగిట పొత్తు పెట్టుకోవాలని ఆ రెండు పార్టీలు భావించాయి.
2014 ఎన్నికల తర్వాత అవశేష ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కెసిఆర్ అధికారంలోకి వచ్చారు. అయితే జగన్ కు కెసిఆర్ సహకారం అందిస్తున్నారని చంద్రబాబు అనుమానించారు. అందుకే కెసిఆర్ పై గురి పెట్టారు.
సాధారణంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండాలి. ప్రస్తుతం ఇప్పటివరకు యాసంగి రైతుబంధు రైతుల ఖాతాల్లో ఇంకా జమ కాలేదు. ఉద్యోగులకు వేతనాలు కూడా ఖాతాల్లో జమ కాలేదు.
2014 మాదిరిగా టిడిపి జనసేన బిజెపి కలిసి వెళ్లాలి అన్నది పవన్ కళ్యాణ్ భావన. చంద్రబాబు సైతం పొత్తు కోసం మొన్నటి వరకు ఆరాటపడ్డారు. కానీ గతం మాదిరిగా ఇప్పుడు అంత ఆత్రం చూపించడం లేదు.
పొత్తులో భాగంగా జనసేనకు టిడిపి 50 సీట్లు ఇవ్వనుందని ప్రచారం జరుగుతోంది. అయితే అంత సీన్ లేదని 20 నుంచి 30 సీట్లు ఇచ్చే అవకాశం ఉందని టిడిపి వర్గాలు చెబుతున్నాయి.
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ ప్రచారం చేయడాన్ని బీజేపీ నేతలు ముందు పెడుతున్నారు. కానీ ఇదంతా తప్పు ముందు బీజేపీ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బలపడాలి.