https://oktelugu.com/

ఆ పార్టీల మధ్య అండర్‌‌ స్టాండింగ్‌ లోపిస్తోందా..?

ఏపీలో బీజేపీ–జనసేనలు ఒక్క కూటమిగా ఉన్నాయి. ఎప్పటినుంచో వీరి మధ్య మంచి అండర్‌‌ స్టాండింగ్‌ ఉంది. అయితే..ఈ మధ్య ఈ కూటమిలో భేదాభిప్రాయాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే… కూటమి అన్నప్పుడు అభిప్రాయ భేదాలు రావడం కామన్‌. అవి ఒకరికొకరు గౌరవించుకునేలా ఉన్నాయి. ఎవరో ఒకరు మెట్టు దిగాలి. కానీ.. బీజేపీ–జనసేనల మధ్య సయోధ్య కనిపించడం లేదు. ఈ సంకేతాలే ఇప్పుడు క్యాడర్‌‌లోకి బలంగా వెళ్తున్నాయి. ఇప్పుడు నేతలు కలిసి వచ్చినా క్యాడర్ ఎంతమేరకు సహకరిస్తుందన్న చర్చ రెండు […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 4, 2021 / 04:23 PM IST
    Follow us on


    ఏపీలో బీజేపీ–జనసేనలు ఒక్క కూటమిగా ఉన్నాయి. ఎప్పటినుంచో వీరి మధ్య మంచి అండర్‌‌ స్టాండింగ్‌ ఉంది. అయితే..ఈ మధ్య ఈ కూటమిలో భేదాభిప్రాయాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే… కూటమి అన్నప్పుడు అభిప్రాయ భేదాలు రావడం కామన్‌. అవి ఒకరికొకరు గౌరవించుకునేలా ఉన్నాయి. ఎవరో ఒకరు మెట్టు దిగాలి. కానీ.. బీజేపీ–జనసేనల మధ్య సయోధ్య కనిపించడం లేదు. ఈ సంకేతాలే ఇప్పుడు క్యాడర్‌‌లోకి బలంగా వెళ్తున్నాయి. ఇప్పుడు నేతలు కలిసి వచ్చినా క్యాడర్ ఎంతమేరకు సహకరిస్తుందన్న చర్చ రెండు పార్టీల్లో నడుస్తోంది.

    Also Read: చంద్రబాబు కొత్త అడుగులు.. బ్రేక్ వేసిన అమిత్ షా..?

    తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక ఈ రెండు పార్టీల క్యాడర్ మధ్య గ్యాప్ పెంచాయనే చెప్పాలి. తిరుపతి ఉప ఎన్నికలో తాము పోటీ చేస్తామంటే తాము పోటీ చేస్తామంటూ రెండు పార్టీలూ రెడీ అయిపోయాయి. తిరుపతి ఉప ఎన్నిక బరిలో దిగేందుకు బీజేపీ తొలి నుంచి ఉత్సాహం చూపుతోంది. పార్లమెంటు స్థానానికి జరిగే ఉప ఎన్నికకు తొలి నుంచి బీజేపీ కసరత్తు చేస్తూనే ఉంది. మండలాల వారీగా ఇన్‌చార్జీలను సైతం నియమించింది. పదేపదే తిరుపతిలో సమావేశాలను ఏర్పాటు చేసుకుని క్యాడర్‌‌లో ఉత్సాహం నింపింది.

    అంతేకాదు.. అభ్యర్థుల పేర్లను కూడా పరిశీలించింది. తిరుపతి నుంచి రామతీర్థం వరకూ రథయాత్ర నిర్వహించేందుకు కూడా బీజేపీ సిద్ధమయింది. ఇవన్నీ తిరుపతి ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని చేసినవే. పార్టీ ఇన్‌చార్జి సునీల్ దేవధర్ కూడా నెలలో రెండుసార్లు తిరుపతిలో కనిపిస్తున్నారు. మరోవైపు జనసేన సైతం తిరుపతిలో తామే పోటీ చేయాలని భావిస్తోంది. తమ పార్టీ అభ్యర్థి బరిలో ఉంటారని, అక్కడ తమ పార్టీకే బలం ఉందని జనసేన వాదిస్తోంది.

    Also Read: తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్‌‌ ఫైర్‌‌..: బీజేపీ ప్లాన్‌ అదేనా..?

    దీనికితోడు జనసేన అభ్యర్థి పోటీలో ఉంటేనే తాను ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ప్రచారం చేస్తానని ప్రకటించారు. అంటే బీజేపీ అభ్యర్థి బరిలో ఉంటే తాను పెద్దగా ప్రచారం చేయనని పవన్ కల్యాణ్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇప్పుడు ఏ పార్టీ అభ్యర్థి బరిలో ఉన్నప్పటికీ ఒక పార్టీ మరొక పార్టీ క్యాడర్ సహకరించే పరిస్థితి లేదు. టీడీపీని వెనక్కి నెట్టి రెండో స్థానంలోనైనా నిలవాలనుకున్న బీజేపీకి అది సాధ్యపడేలా కనిపించడం లేదనేది వాస్తవం.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్