https://oktelugu.com/

రైతుల ఆందోళనపై సంచలన వ్యాఖ్యలు చేసిన విరాట్ కోహ్లీ

కేంద్రంలోని బీజేపీ తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రెండు నెలలుగా ఆందోళన చేస్తున్న రైతులకు దేశ, విదేశాల్లో మద్దతు పెల్లుబుకుతోంది. రైతు ఉద్యమంపై ఇటీవల అమెరికాకు చెందిన పాప్ సింగర్, యూరప్ కు చెందిన పర్యావరణ ప్రేమికురాలు ట్వీట్లు చేయడంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. విదేశీ ప్రముఖులపై దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సైతం మండిపడ్డారు. భారత్ లోని ఆందోళనలపై మీకేం తెలుసని.. ఇది భారత అంతర్గత వ్యవహారాల్లో మీ జోక్యం […]

Written By:
  • NARESH
  • , Updated On : February 4, 2021 / 04:26 PM IST
    Follow us on

    కేంద్రంలోని బీజేపీ తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రెండు నెలలుగా ఆందోళన చేస్తున్న రైతులకు దేశ, విదేశాల్లో మద్దతు పెల్లుబుకుతోంది. రైతు ఉద్యమంపై ఇటీవల అమెరికాకు చెందిన పాప్ సింగర్, యూరప్ కు చెందిన పర్యావరణ ప్రేమికురాలు ట్వీట్లు చేయడంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది.

    విదేశీ ప్రముఖులపై దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సైతం మండిపడ్డారు. భారత్ లోని ఆందోళనలపై మీకేం తెలుసని.. ఇది భారత అంతర్గత వ్యవహారాల్లో మీ జోక్యం ఏంటని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ వాదనలను కొందరు భారత సెలెబ్రెటీలు.. బాలీవుడ్ స్టార్లు సైతం సమర్థించారు.

    తాజాగా ఈ రైతుల ఆందోళనపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. బుధవారం రాత్రి ట్వీట్ చేశాడు. రైతుల ఆందోళనల విషయంలో దేశం మొత్తం ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చాడు.

    కోహ్లీ ట్వీట్ చేస్తూ ‘దేశంలో రైతుల ఆందోళనలపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ అందరం కలిసికట్టుగా ఉందాం. రైతులు మనదేశంలో అంతర్భాగం. అందరం శాంతియుతంగా సమష్టిగా ముందుకు వెళ్లేలా అన్ని వర్గాల మధ్య సామరస్యపూర్వక పరిష్కారం లభిస్తుందని నమ్ముతున్నాను’ అని పేర్కొన్నారు.