పదో తరగతి చదువుతో తపాలా ఉద్యోగం.. ఎలా దరఖాస్తు చేయాలంటే..?

పదో తరగతి చదువుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని భావించే వాళ్ల కొరకు గ్రామీణ డాక్ సేవ‌క్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన వాళ్లు రాత పరీక్ష రాయకుండానే సులభంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక కావచ్చు. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో 3,446 గ్రామీణ్ డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. Also Read: 2021 సంవత్సరంలో ఎక్కువ డిమాండ్ ఉన్న ఉద్యోగాలివే..? మొత్తం 3,446 ఉద్యోగాలలో […]

Written By: Navya, Updated On : February 4, 2021 5:44 pm
Follow us on

పదో తరగతి చదువుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని భావించే వాళ్ల కొరకు గ్రామీణ డాక్ సేవ‌క్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన వాళ్లు రాత పరీక్ష రాయకుండానే సులభంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక కావచ్చు. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో 3,446 గ్రామీణ్ డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది.

Also Read: 2021 సంవత్సరంలో ఎక్కువ డిమాండ్ ఉన్న ఉద్యోగాలివే..?

మొత్తం 3,446 ఉద్యోగాలలో ఏపీలో 2,296 తెలంగాణలో 1,150 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాల కొరకు సులువుగా దరఖాస్తు చేసుకోవచ్చు. https://appost.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 26వ తేదీలోగా ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read: సీడాక్ సంస్థలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే..?

ఈ నోటిఫికేషన్ ద్వారా బ్రాంచ్ పోస్టు మాస్ట‌ర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్ట‌ర్ (ఏబీపీఎం), డాక్ సేవ‌క్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరుగుతోంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 10,000 రూపాయల నుంచి 14,500 రూపాయల మధ్య వేతనం లభిస్తుంది. 2021 సంవత్సరం జనవరి 27 నాటికి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

ఉన్న‌త విద్యార్హ‌త‌లు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకున్నా వారికి అదనపు అర్హతలు లభించవు. ఓసీ, బీసీ, ఈడ‌బ్ల్యూఎస్ పురుష అభ్యర్థులు 100 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ప‌దో త‌ర‌గ‌తి మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాలకు తుది ఎంపిక ఉంటుంది.