https://oktelugu.com/

మోడీ గడ్డం వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

సెలబ్రెటీల్లో కొందరు పేరు చెప్పగానే వారి వేషధారణ గుర్తుకు వస్తుంది. ఒక్కొక్కరు ఒక్కో మ్యానరిజం.. వేషాధారణతో ఆకట్టుకోవడం చూస్తూనే ఉంటున్నాం.. కరుణానిధి నల్లకళ్లజోడు.. చంద్రబాబుకు తెల్లగడ్డం ఇలా చెప్పుకుంటూ పోతూ చాలామందే ఉన్నారు. ఇక ప్రధాని మోడీ సైతం ఢిపరెంట్ లుక్కుతో ఆకట్టుకుంటారు. బయట దేశాలకు వెళ్లినప్పుడు అక్కడికి తగ్గట్టుగా డ్రెస్సింగ్ చేస్తుంటారు. ఆయన దుస్తుల ఎంపికలోనూ ప్రత్యేకత కన్పిస్తుంటూ ఉంటుంది. గతంలోనూ రాహుల్ గాంధీ మోదీని ఉద్దేశించి ‘సూటు..బూటు’ ప్రభుత్వం అంటూ సైటర్లు వేయడం అప్పట్లో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 20, 2020 / 08:07 PM IST
    Follow us on


    సెలబ్రెటీల్లో కొందరు పేరు చెప్పగానే వారి వేషధారణ గుర్తుకు వస్తుంది. ఒక్కొక్కరు ఒక్కో మ్యానరిజం.. వేషాధారణతో ఆకట్టుకోవడం చూస్తూనే ఉంటున్నాం.. కరుణానిధి నల్లకళ్లజోడు.. చంద్రబాబుకు తెల్లగడ్డం ఇలా చెప్పుకుంటూ పోతూ చాలామందే ఉన్నారు. ఇక ప్రధాని మోడీ సైతం ఢిపరెంట్ లుక్కుతో ఆకట్టుకుంటారు. బయట దేశాలకు వెళ్లినప్పుడు అక్కడికి తగ్గట్టుగా డ్రెస్సింగ్ చేస్తుంటారు. ఆయన దుస్తుల ఎంపికలోనూ ప్రత్యేకత కన్పిస్తుంటూ ఉంటుంది. గతంలోనూ రాహుల్ గాంధీ మోదీని ఉద్దేశించి ‘సూటు..బూటు’ ప్రభుత్వం అంటూ సైటర్లు వేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.

    Also Read: రాజకీయాల్లోకి వచ్చేందుకు జంకుతున్న రజనీ?

    అయితే ఇటీవల కాలంలో మోడీ డ్రెస్సింగ్ విషయంలోగానీ.. ఇతరత్ర విషయాల్లోగానీ పెద్దగా చర్చ జరిగిన సందర్భాల్లేవు. అయితే ఇటీవలీ కాలంలో మోదీలో కొంత మార్పు కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. ఆయన దుస్తులతోపాటు.. హెయిర్ స్టైల్.. గడ్డం అన్నింటిలోనూ చాలా జాగ్రత్త తీసుకుంటున్నట్లు కన్పిస్తోంది. ఆయనకు బారుగడ్డం ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఇటీవలీ కాలంలో గడ్డం సైజు, మీసాల సైజు పెంచుతూ రుషిలా కన్పిస్తున్నారని పలువురు అంటున్నారు. కొందరు మాత్రం మోడీ గడ్డానికి రాజకీయానికి లింకు చేస్తూ మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.

    మోడీ గడ్డాన్ని ఎందుకు అంతలా పెంచుతున్నారనే దానిపై రకరకాల కారణాలు విన్పిస్తున్నాయి. మరికొద్దిరోజుల్లో పశ్చిమ బెంగాల్లో ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే మోడీ గడ్డం పెంచుతున్నారనే టాక్ విన్పిస్తోంది. కిందటి ఎన్నికల్లో బీజేపీ పశ్చిమ బెంగాల్లో పాగా వేసేందుకు ప్రయత్నించినా సీఎం మమతా బెనర్జీ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో ఈసారి ఎలాగైనా బెంగాల్ లో పాగా వేయాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే బెంగాలీలు అమీతంగా ఆరాధించే రవీంద్రనాథ్ ఠాగూర్ మాదిరిగా మోడీ కన్పించేందుకు ప్రయత్నిస్తున్నారట. అందుకు తగ్గట్టుగానే మోడీ పొడవాటి తెల్లటి గడ్డం పెంచుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

    Also Read: కరోనా వచ్చిపోతే బతుకుకు భరోసా..?

    ఠాగూర్ లా కన్పిస్తూ బెంగాలీల మనస్సును దోచుకునేందుకే మోడీ గడ్డం పెంచుతున్నారని ప్రత్యర్థులు ఇప్పటికే నుంచే సైటర్లు వేస్తున్నారు. దీనిపై మోడీ వీరాభిమానులు మాత్రం కరోనా లెక్క తేలేంత వరకు ఆయన గడ్డాన్ని ట్రీమ్ చేయకుండా వదిలేశారని అంటూ క్లారిటీ ఇస్తున్నారు. ఏదిఏమైనా మోడీ గడ్డం పెంచడం ప్రస్తుతం రాజకీయాల్లో మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఈ గడ్డం వెనుక కథేంటో మోడీ క్లారిటీ ఇస్తారో లేదో వేచి చూడాల్సిందే..!