ఇంతకన్నా నీచం ఉంటుందా? కులాల వారిగా క్వారంటైన్ సెంటర్లు

ఈ మధ్య కాలంలో తరచూ అనేక వివాదాస్పద అంశాలతో వార్తల్లో నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్ లో కొత్త ట్రెండ్ వెలుగుచూసింది. కుల రాజకీయాలను ఎంతో నేర్పుతో అక్కున చేర్చుకున్న ఈ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో ఈ ఒరవడి మరింత ఎక్కువైనట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు కుల ప్రాతిపదికన మ్యారేజ్ బ్యూరోలు, సత్రాలు ఉండటం మనకు తెలుసు కానీ తాజాగా అదే ప్రాతిపదికన క్వారంటైన్ సెంటర్లు కూడా పుట్టుకొచ్చాయి. ప్రపంచంలో లో కరోనా వైరస్ కుల, మత, ప్రాంత భేదాలు […]

Written By: Navya, Updated On : August 20, 2020 8:50 pm
Follow us on

ఈ మధ్య కాలంలో తరచూ అనేక వివాదాస్పద అంశాలతో వార్తల్లో నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్ లో కొత్త ట్రెండ్ వెలుగుచూసింది. కుల రాజకీయాలను ఎంతో నేర్పుతో అక్కున చేర్చుకున్న ఈ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో ఈ ఒరవడి మరింత ఎక్కువైనట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు కుల ప్రాతిపదికన మ్యారేజ్ బ్యూరోలు, సత్రాలు ఉండటం మనకు తెలుసు కానీ తాజాగా అదే ప్రాతిపదికన క్వారంటైన్ సెంటర్లు కూడా పుట్టుకొచ్చాయి.

ప్రపంచంలో లో కరోనా వైరస్ కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా నిష్పక్షపాతంగా తన దారికి అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరినీ అటాక్ చేస్తూ వెళ్తున్న నేపథ్యంలో…. ఈ వైరస్ బారిన పడిన వారి నుండి ఇతరులకు సోకకుండా వైరస్ ఉండేందుకు ఏర్పాటుచేసిన క్వారంటైన్ సెంటర్లలో చాలామంది చికిత్స తీసుకుంటూ ఉండటం మనకు తెలుసు. ఇక ఈ రోజుల్లో పెద్ద ఎత్తున కేసులు పెరుగుతుండడంతో అంతగా లక్షణాలు లేని వారిని ఇళ్లలోనే క్వారంటైన్ లో ఉండమని సూచిస్తున్నారు. ఇక అసౌకర్యంగా ఉన్న వారిని మాత్రమే క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నారు.

అయితే, క్వారంటైన్ సెంటర్లలో సరైన సౌకర్యాలు లేకపోవడం, కొన్నిచోట్ల నాసిరకం భోజనం అందజేస్తుండటంతో చాలామంది ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. ఇప్పుడు ఇదే క్రమంలో కులాలవారీగా క్వారంటైన్ సెంటర్లు వచ్చినట్లు తెలుస్తోంది. పలు కులాలవారు తమ కులం పేరుతో క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేశారు. చాలా జిల్లాల్లో ఈ ఒరవడి కొత్తగా మొదలైంది. ఆ క్వారంటైన్ సెంటర్లలో ఆ కులానికి చెందిన వారిని మాత్రమే అనుమతిస్తారు. ఒకవేళ ఇతర కులాల వారు ఎవరైనా అక్కడికి వెళితే బెడ్లు ఖాళీ లేవని, ఆక్సిజన్ సిలిండర్ లు అయిపోయాయని చెప్పి వారిని పంపించేస్తారు.

దీంతో ఇతర కులాల వారు కూడా తమ ప్రాణాలు రక్షించుకునేందుకు అంతా కలిసి వారి కులం వారిని మాత్రమే అనుమతించే సెంటర్లు ఏర్పాటు చేసుకుంటారు. నిజానికి ఈ కులం క్వారంటైన్ సెంటర్ కాన్సెప్టు ఉత్తర భారతదేశం నుండి దిగుమతి చేసుకున్నది. రాజకీయ పార్టీలు సైతం ఇదే అంశం ప్రాతిపదికన ఇప్పుడు తమ వ్యవహారాలు చక్కబెట్టే పనిలో ఉంటున్నాయి.

ఈ తరుణంలో దక్షిణ భారతదేశంలో.. అందులోనూ ఏపీ లో కుల రాజకీయాలు మరింత ఎక్కువ కావడంతో ఆ కాన్సెప్ట్ నచ్చి ఇక్కడ కూడా వాటిని ప్రారంభించేశారని తెలుస్తోంది. ఏదైనా అంటే…. అందరికీ సాయం చేసే పరిస్థితి లేకపోవడంతో కనీసం తమ కులం వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇలాంటి సెంటర్లు ఏర్పాటు చేశామని…. దీనిని భూతద్దంలో పెట్టి చూడవద్దని సెంటర్ల నిర్వాహకులు ఆయా క్వారంటైన్ నిర్వాహకులు చెబుతున్నారు. ఇంక వీరిని ఇంకేమనాలి…?