https://oktelugu.com/

కేసీఆర్ గారు.. మీరు వేస్టట?

తెలంగాణ రాష్ట్రానికి తర్వాతి సీఎం ఎవరనేది..? తెరపైకి వచ్చినప్పటినుండి ఆ స్థానానికి సరిపడ్డ వ్యక్తి కేసీఆర్ తనయుడు కేటీఆర్‌ పేరు వినిపిస్తోంది. ఆ పార్టీ నాయకులే కాదు తాజాగా ఇదే విషయంపై సీపీఐ నేత నారాయణ కూడా వ్యంగంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రానికి కేటీఆర్‌ ను ముఖ్యమంత్రిని చేసిన కేసీఆర్ రెస్ట్ తీసుకోవాలని సీపీఐ నేత నారాయణ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తెలంగాణలో కేటీఆర్ పాలన నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ ఎక్కువగా ఫామ్‌ హౌజ్‌ కు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 20, 2020 7:56 pm
    Follow us on

    Cm ktr

    తెలంగాణ రాష్ట్రానికి తర్వాతి సీఎం ఎవరనేది..? తెరపైకి వచ్చినప్పటినుండి ఆ స్థానానికి సరిపడ్డ వ్యక్తి కేసీఆర్ తనయుడు కేటీఆర్‌ పేరు వినిపిస్తోంది. ఆ పార్టీ నాయకులే కాదు తాజాగా ఇదే విషయంపై సీపీఐ నేత నారాయణ కూడా వ్యంగంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రానికి కేటీఆర్‌ ను ముఖ్యమంత్రిని చేసిన కేసీఆర్ రెస్ట్ తీసుకోవాలని సీపీఐ నేత నారాయణ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తెలంగాణలో కేటీఆర్ పాలన నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ ఎక్కువగా ఫామ్‌ హౌజ్‌ కు పరిమితమవుతున్నారని నారాయణ అన్నారు. ఇలాంటి పరిస్థితులు కొనసాగించకుండా కేటీఆర్‌ను సీఎం చేసి కేసీఆర్ రెస్ట్ తీసుకోవాలని నారాయణ తెలిపారు. పరిపాలన మొత్తం అధికారికంగానే కేటీఆర్‌ కు అప్పగించడం వల్ల అతడు ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుందని వెల్లడించారు. వరదల కారణంగా దెబ్బతిన్న వరంగల్‌ లోని పలు ప్రాంతాల్లో నారాయణ పర్యటించారు.

    రెండు రోజుల క్రితం వరంగల్‌ లో పర్యటించిన మంత్రి కేటీఆర్ రూ. 10 కోట్లు కేటాయించి వెళ్లిపోయారని నారాయణ అన్నారు. వరంగల్‌ లో పరిస్థితులు మెరుగుపడాలంటే దాదాపు రూ. 1000 కోట్లు కేటాయించాలని తెలిపారు. వరదలకు కారణమైన ఆక్రమణలు తొలగించాలని మంత్రి కేటీఆర్ అన్నారని.. అయితే ఆక్రమణల్లో ఎక్కువగా టీఆర్ఎస్ నాయకులే ఇన్వాల్వ్ అయ్యారని ఆయన ఆరోపించారు. అలాంటప్పుడు కేటీఆర్ చెప్పినట్టు ఆక్రమణల తొలగింపు ఏ రకంగా సాధ్యమవుతుందని నారాయణ ప్రశ్నించారు.