Nara Lokesh: నారా లోకేష్ అటు తిరిగి ఇటు తిరిగి చివరకు మంగళగిరి మీదే ఫోకస్ పెడుతున్నారు. ఆయన ఈ మధ్య తరచుగా ఈ నియోజకవర్గంలోనే పర్యటించడాన్ని బట్టి చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో మరోసారి ఇక్కడి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొన్నటి వరకు ఆయన నియోజకవర్గం మారుతారనే టాక్ నడిచింది. కానీ తాజా పరిస్థితులును చూస్తే మాత్రం ఆయన మంగళగిరిని విడిచిపెట్టేలా కనిపించట్లేదని తెలుస్తోంది.
లోకేష్ ఇప్పుడు గ్రౌండ్ లెవల్ లో ఇక్కడ పనితనం చూపిస్తున్నారు. ఆయనకు కాలం కూడా కలిసి వస్తోందనే చెప్పాలి. ఎందుకంటే రాజధానిని అమరావతి నుండి విశాఖపట్నంకు మార్చే ప్లాన్ చేస్తోంది. వైసీపీ. ఇక దానికి స్థానికి ఎమ్మెల్యే అయిన ఆళ్ల కృష్ణారెడ్డి సహకరించడాన్ని లోకేష్ తనకు అస్త్రంగా మార్చుకుంటున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతోనే ఓడిపోయారు. ఆర్కే కంటే ఐదువేల ఓట్లు తక్కువ రావడంతో ఓటమి పాలయ్యారు.
ఇదేమంత పెద్ద తేడా కాకపోవడం, పైగా ఆర్కే ఇక్కడి నుంచి రెండుసార్లు గెలవడంతో మూసారి ఆయనకు ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఆయన మీద వ్యతిరేకత పెరుగుతుండటం లోకేష్‌కు కలిసి వచ్చే అంశం. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల చట్టంతో మంగళగిరిలో పరిస్థితులు మారిపోయాయి. ఎమ్మెల్యే దానికి సహకరించడం ఇక్కడి ప్రజలు ఆయన మీద ఆగ్రహంతో ఉన్నారు.
కాబట్టి ఈ పరిస్థితులను అవకాశం మలుచుకునేందకు లోకేష్ ఇక్కడే పాగా వేస్తున్నారు. గతంలో అమరావతి ఉద్యమాన్ని కించపరిచేలా ఆర్కే చేసిన కామెంట్లు ఆయన మీద వ్యతిరేకత తీసుకొస్తున్నాయి. ఇక రైతులకు ఆయన అపాయింట్ మెంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడాన్ని లోకేష్ పదే పదే చెబుతూ తనకు ప్లస్ అయ్యేలా చూసుకుంటున్నారు. ఇక ఇక్కడ స్థానిక నాయకులను సమన్వయం చేసుకుంటూ లోకేష్ ముందుకు వెళ్లడంతో సీన్ మారుతోందని తెలుస్తోంది.
Also Read: KA Paul: డబ్బులిచ్చి మరీ తెలుగు న్యూస్ చానల్స్ లో కేఏ పాల్ ప్రమోషన్ అందుకోసమేనట?