Brian Lara: ఐపీఎల్ 2022 కోసం హైదరాబాద్ సన్ రైజర్స్ సన్నద్ధం అవుతోంది. ఇందుకు గాను జట్టును పూర్తిస్థాయిలో తయారు చేసేందుకు సిద్ధమవుతోంది. దిగ్గజ బ్యాటర్ బ్రియాన్ లారా, దక్షిణాఫ్రికా బౌలర్ డేల్ స్టెయిన్, సైమన్ కటిచ్ లను చేర్చుకున్నారు. లారా బ్యాటింగ్ కోచ్, స్టెయిన్ బౌలింగ్ కోచ్, సైమన్ కటిచ్ అసిస్టెంట్ కోచ్ గా నియమించింది. దీంతో జట్టును విజయపథంలో నడిపించేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. హైదరాబాద్ జట్టు ప్రధాన కోచ్ గా టామ్ మూడీ బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది.

టెస్ట్ క్రికెట్ లో తన సత్తా చాటిన బ్యాట్స్ మెన్ గా బ్రియాన్ లారాకు గుర్తింపు ఉంది. ఒకే టెస్ట్ మ్యాచ్ లో 400 పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్ మెన్ గా అతడికి గుర్తింపు ఉంది. దీంతో లారా ప్రతిభపై అందరికి తెలిసిందే. దీంతో సన్ రైజర్స్ సత్తా చాటేందుకు లారాను తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హేమంగ్ బదానీ ఫీల్డింగ్ కోచ్ గా స్కౌట్ గా ద్విపాత్రాభినయం చేసేందుకు సిద్ధమయ్యాడు.
ముత్తయ్య మురళీధరన్ జట్టుకు వ్యూహాలు రచించేందుకు సహకరించనున్నాడు. దీంతో సన్ రైజర్స్ వచ్చే సీజన్ లో విజయం సాధించి తీరాలని భావిస్తోంది. దీని కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. బ్రియాన్ లారా ట్రాక్ రికార్డు చూస్తే ఆశ్చర్యమేస్తుంది. వెస్టిండీస్ తరఫున 133 టెస్టులు, 299 వన్డేలు ఆడి టెస్టుల్లో 34 సెంచరీలు, వన్డేల్లో 19 సెంచరీలు చేసిన ఘనత అతడిదే.
Also Read: WTC Points: టాప్ ప్లేసులోకి ఆస్ట్రేలియా.. టీమిండియా ర్యాంక్ ఎంత?
క్రికెట్ లో లారా ఒక మైలు రాయి అని చెప్పొచ్చు. జట్టును విజయతీరాలకు చేర్చడంలో అందెవేసిన చేయి. అంతే కాదు వ్యూహాలు రచించడంలో కూడా దిట్ట. దీంతో అతడిని సన్ రైజర్స్ కోసం ఎంపిక చేసి జట్టుకు జీవం పోశారు రాబోయే సీజన్ లో హైదరాబాద్ జట్టుకు కచ్చితంగా ఓ అద్భుతమైన ప్రదర్శన చేయడంలో కీలక పాత్ర పోషిస్తాడని తెలుస్తోంది.
Also Read: కోహ్లిపై బీసీసీఐ కుట్ర పన్నుతోందా? దక్షిణాఫ్రికా పర్యటనలో రాణించకపోతే అంతేనా?