Amaravati Issue: ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అమరావతి అభివృద్ధికి చర్యలు తీసుకోవడం లేదు. వైసీపీ తీరుతో పనులు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ మూడు రాజధానుల వ్యవహారం తెరపైకి తేవడంతో అక్కడ జరిగే పనులన్ని నిలిచిపోయాయి. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ సంస్థల కట్టడాలు సైతం ఆగిపోయాయి. జగన్ తీసుకున్న నిర్ణయంతో అందరు పనులు చేయడానికి వెనుకాడటం జరిగింది. దీంతో అమరావతిలో కేంద్ర విభాగాలు, సంస్థల కోసం స్థలాలు తీసుకుని నిర్మాణాలు చేపట్టాలని భావించింది. కానీ జగన్ మధ్యలో రాజధానిపై దృష్టి పెట్టకుండా మూడు రాజధానుల అంశం తీసుకురావడంతో పనులు నిలిచిపోయినట్లు తెలుస్తోంది.

అమరావతి నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత రాజధాని మార్పు చేయడంతో కేంద్ర ప్రభుత్వం తన కార్యాలయాల నిర్మాణాలకు ముందుకు రాలేదు. దీంతో అవి నిలిచిపోయాయి. కానీ ఇప్పుడు వాటి నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం కోసం 208 ఎకరాలు కేటాయించింది. అయితే కొన్నింటికి తక్కువ ధర, ఇంకొన్నింటిని ఉచితంగా అందజేసింది. దీంతో ప్రస్తుతం నిర్మాణాలకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Also Read: యూపీ సహా 3 రాష్ట్రాల్లో బీజేపీ జైత్రయాత్ర.. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ దూకుడు
అమరావతి నిర్మాణానికి కేంద్రం రూ.1500 కోట్లు కేటాయించిందని తెలుస్తోంది. అలాగే విజయవాడ, గుంటూరు నగరాలకు ఇచ్చిన వెయ్యి కోట్లతో కలుపుకుని ఇప్పటి వరకు రూ.2500 కోట్లు ఇచ్చింది. రాష్ట్ర హైకోర్టు మూడు రాజధానుల విషయం వద్దని అమరావతినే రాజధానిగా చేసుకోవాలని సూచించడంతో ప్రస్తుతం ఇక్కడ నిర్మాణాలు జరుగుతాయని తెలుస్తోంది. మొత్తానికి రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అన్నింటి మీద ప్రభావం పడింది. స్థలాలు తీసుకున్న సంస్థలు నిర్మాణాలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.

దీంతో సీఆర్డీఏ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం కూడా తన నిర్మాణాలు చేసేందుకు చొరవ చూపాల్సిందే. దీనికి గాను కేంద్రం భవిష్యత్ లో జరిగే పరిణామాల దృష్ట్యా నిర్మాణాలకు సుముఖంగా ఉండాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్రం కూడా తనకు కేటాయించిన స్థలాల్లో నిర్మాణాలు చేపట్టి పరిపాలన చేసేందుకు సిద్ధంగా ఉండాలని అందరు కోరుతున్నారు. అమరావతి రాజధానిగా చేసే క్రమంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్రం తన నిర్మాణాలు పూర్తి చేయాల్సిన అవసరం ఉందని గుర్తించాల్సిందే.
Also Read: హైదరాబాద్ రాజధాని ఆంధ్రప్రదేశ్ కా? వైస్సార్సీపీ నాయకులకా?
[…] BJP- Early Elections: దేశంలో అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో బీజేపీ నాలుగు స్టేట్లలో విజయం సాధించగా ఆప్ ఒక రాష్ర్టంలో గెలిచి అందరి అంచనాలు నిజం చేశాయి. దీంతో కేంద్రం ఇప్పుడు దూకుడు మీద ఉంది. నిర్ణయాలు తీసుకునేందుకు వేగవంతంగా కదులుతోంది. ఎన్నో రోజులుగా నాన్చుతూ వస్తున్న జమిలి ఎన్నికల కార్యాచరణ ప్రణాళిక రూపొందించనుంది. దీని కోసం ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దేశంలో ఎన్నికల ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశం అవుతోంది. జమిలి ఎన్నికలపై బీజేపీ దృష్టి సారించింది. […]