
ఐదు రోజుల్లో పెళ్లి జరగనుండగా కాబోయే వధువును షాపింగ్ కు తీసుకువెళ్లి, ఆమెను హతమార్చిన వరుడి ఘటన ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ నగరంలో వెలుగుచూసింది. టీనా అనే యువతికి తనకు కాబోయే భర్త, వరుడు జితిన్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. పెళ్లి వేడుక కోసం చీరలు కొనడానికి రమ్మని జితిన్ టీనాను కోరాడు. షాపింగ్ కోసం వచ్చిన టీనాను జితిన్ హత్య చేశాడు. టీనాను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే ఆమెను హత్య చేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.