అదేంటి.. తెలంగాణ సీఎం కేసీఆర్, టీచర్ల మధ్య బంధం చెడిందా..? ఈ మధ్య వారిని కేసీఆర్ అస్సలు పట్టించుకోవడం లేదా..? పరిస్థితులను చూస్తుంటే అదే అనిపిస్తోంది. కారణమేంటో కానీ ఆయన మాత్రం టీచర్లను దూరం పెడుతున్నారు. అంతెందుకు మొన్నటి గ్రేటర్ ఎన్నికల్లోనూ ఎలక్షన్ డ్యూటీ టీచర్లకు కేటాయించలేదు. ఇతర జిల్లాల నుంచి వేరే శాఖల ఉద్యోగుల్ని తీసుకువచ్చారు.
Also Read: దేవుడితో రాజకీయం.. అడ్డంగా దొరికిన చంద్రబాబు?
సాధారణంగా ఎన్నికలంటే విధుల్లో టీచర్లే ఎక్కువగా కనిపిస్తారు. కానీ.. కేసీఆర్ మాత్రం వద్దనుకున్నారు. తాజాగా ఉద్యోగ సంఘాలకు వరాలు ప్రకటిస్తామంటూ ఏర్పాటు చేసిన భేటీకి కూడా ఉపాధ్యాయ, పెన్షనర్లు, తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులకు ఆహ్వానం పంపలేదు. తెలంగాణలో సుమారు 120 ఉద్యోగ సంఘాలున్నాయి. టీఎన్జీవో, టీజీవోలతోపాటు.. ఉపాధ్యాయ, పెన్షనర్లు, తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్‌లు ప్రధానమైనవి. పిలిస్తే అందరినీ పిలవాలి. అయినా ఉపాధ్యాయులు ఏమనుకున్నా సరే.. వారిని దూరం పెట్టాలని కేసీఆర్ డిసైడైనట్లుగా తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.
తమను ఉద్దేశపూర్వకంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ దూరం పెడ్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు కూడా అసంతృప్తిలో ఉన్నాయి. ఇతర సంఘాల నేతలు కూడా కేసీఆర్ ప్రాపకం కోసం ఉద్యోగుల్లో విభజన తెస్తున్నారని మండిపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జోనల్ వ్యవస్థను సవాల్ చేస్తూ.. ఉపాధ్యాయ సంఘాలు కోర్టుకు వెళ్లాయి. జోనల్ వ్యవస్థపై కోర్డులో స్టే వచ్చింది.
Also Read: కార్పొరేటర్లపై అనర్హత.. ఎన్నికల కమిషన్ వార్నింగ్..!
అయితే.. ఈ విషయంలోనే కేసీఆర్ టీచర్ల పై అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. ఓ సందర్భంలో తాను స్వయంగా విజ్ఞప్తి చేసినప్పటికీ ఉపాధ్యాయులు పట్టించుకోలేదని.. అందుకే తాను వారిని పట్టించుకోకూడదన్నట్లుగా కేసీఆర్ ఉంటున్నారని అంటున్నారు. మొత్తానికి ఉపాధ్యాయ సంఘాలతో కేసీఆర్ మళ్లీ మామూలుగా వ్యవహరించాలంటే వారితో అంతకంటే గొప్ప అవసరం పడాలన్న సెటైర్లు తెలంగాణలో వినిపిస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్