ఆల్‌రెడీ ఓ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నాడు.. కానీ.. అప్పుడే మరో సీఎం పేరును ప్రచారంలోకి తేవడం ఎంతవరకు కరెక్ట్. తెలంగాణ అధికార పార్టీలో ఇదే మాట వినిపించడం అంటే.. అది అసంతృప్తి కావడమో.. వ్యూహాత్మకమో అయి ఉండాలి. ప్రాంతీయ పార్టీల్లో టీఆర్ఎస్ లాంటి పార్టీల్లో అసంతృప్తికి చోటు అనేది లేదు. కాబట్టి కచ్చితంగా అది వ్యూహాత్మకమే అనుకోవాలి. ఇప్పుడు టీఆర్ఎస్‌లో ఈ వ్యూహాత్మక అధికార మార్పిడి చర్చ జోరుగా సాగుతోంది.
Also Read: టీచర్లను కేసీఆర్ అందుకే దూరం పెడుతున్నారా..?
ప్రణాళిక ప్రకారం అన్నట్లుగా ఒకరి తర్వాత ఒకరు.. కేసీఆర్ ఇక దిగిపోవాలని.. కేటీఆర్‌కు సీఎం పదవి ఇవ్వాలనే డిమాండ్‌ను వినిపిస్తున్నారు. రానురాను ఈ వాయిస్ పెరుగుతోంది. అయితే.. ఈ వాయిస్ కాస్త హైకమాండ్ నుంచి వస్తున్న సూచనల మేరకే అని చర్చ జరుగుతోంది. కొద్ది రోజుల కిందట టీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ స్పందిస్తూ కేటీఆర్ మూడు నెలల్లో సీఎం అవుతారని ప్రకటించారు. కేసీఆర్ అలసిపోయారన్నట్లుగా ఆయన మాట్లాడి కేటీఆర్‌కు బాధ్యతలివ్వాలన్నారు. నిజానికి ఇది పార్టీ లైన్ కు విరుద్ధంగా ఉంటే.. అప్పుడే ఆయనతో పాటు అందరికీ సంకేతాలు వెళ్లేవి. ఇంకెవరూ సీఎం పదవి గురించి మాట్లాడవద్దని ఎక్కడా హైకమాండ్ చెప్పలేదు. అంటే.. హైకమాండ్ ఆలోచనల మేరకే రెడ్యానాయక్ అలా మాట్లాడారని క్లారిటీ వచ్చింది.
తాజాగా.. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా అదే చెబుతున్నారు. కేటీఆర్ డైనమిక్ అని అంటున్నారు. ముఖ్యమంత్రి పదవి పొందడానికి ఇదే సరైన సమయం అన్నట్లుగా మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ నుంచి కేటీఆర్ సీఎం అనే డిమాండ్లు ముందు ముందు మరింత పెరిగే అవకాశం ఉంది. తర్వాత ర్యాలీలు జరిగినా ఆశ్చర్య పోనవసరం లేదని అంచనా వేయవచ్చు.
Also Read: కార్పొరేటర్లపై అనర్హత.. ఎన్నికల కమిషన్ వార్నింగ్..!
అయితే.. రాజకీయం చేయడంలో కేసీఆర్ వ్యూహాలు ఎవరికీ అర్థం కావు. ఎవరి అంచనాలకూ అందవు. తాను అనుకున్నది అమలు చేయడానికి ముందుగా కొందరికి లీక్‌లు ఇచ్చి.. దాని పర్యావసనాలను తెలుసుకుంటూ ఉంటారు. అయితే.. ఇప్పుడు కేటీఆర్‌ను సీఎం సీటు ఎక్కించే విషయంలోనూ అదే జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ వ్యూహం ప్రకారం కేటీఆర్ సీఎం అనే డిమాండ్‌ను పీక్స్‌కు తీసుకెళ్లి.. ఆ తర్వాత తాను చేయాలనుకున్నది చేస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందుకు మూడు నెలలు పట్టవచ్చని అంచనా.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్