https://oktelugu.com/

కేసీఆర్‌‌ దిద్దు‘బాట’ చర్యలు

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పుంజుకోవడం కేసీఆర్‌‌ తట్టుకోలేకపోతున్నారు. ఇన్నాళ్లు తనకంటూ తిరుగులేదంటూ రాష్ట్రాన్ని ఏలిన కేసీఆర్‌‌కు అనుకోకుండా ఎదురుదెబ్బ తగలడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా ఇంత వ్యతిరేకత ఎందుకొచ్చిందంటూ జీర్ణించుకోలేకపోతున్నారట. తన సొంత జిల్లా దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి పాలైనా అంతగా సీరియస్‌గా తీసుకోలేదు కేసీఆర్‌‌. కానీ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ ఎదురుదెబ్బ తగలడంతో మరింత కుంగదీసింది. Also Read: అగ్రి చట్టాలపై కేసీఆర్‌‌ యూటర్న్‌ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 28, 2020 / 01:28 PM IST
    Follow us on


    తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పుంజుకోవడం కేసీఆర్‌‌ తట్టుకోలేకపోతున్నారు. ఇన్నాళ్లు తనకంటూ తిరుగులేదంటూ రాష్ట్రాన్ని ఏలిన కేసీఆర్‌‌కు అనుకోకుండా ఎదురుదెబ్బ తగలడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా ఇంత వ్యతిరేకత ఎందుకొచ్చిందంటూ జీర్ణించుకోలేకపోతున్నారట. తన సొంత జిల్లా దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి పాలైనా అంతగా సీరియస్‌గా తీసుకోలేదు కేసీఆర్‌‌. కానీ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ ఎదురుదెబ్బ తగలడంతో మరింత కుంగదీసింది.

    Also Read: అగ్రి చట్టాలపై కేసీఆర్‌‌ యూటర్న్

    జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్య రీతిలో సీట్లు సాధించిన బీజేపీ.. టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని చాటి చెప్పింది. ప్రతిపక్షమనేదే లేకుండా చేయాలనుకోవడం.. ఏకపక్ష నిర్ణయాల కారణంగా కేసీఆర్‌ ఈ స్థాయిలో వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇదే తరహాలో ముందుకెళ్తే.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎదురుదెబ్బ తగలడం ఖాయమని కేసీఆర్ భావించారు. అందుకే మెల్లగా దిద్దుబాటు చర్యలను ప్రారంభించారు.

    కేసీఆర్ సర్కారు తీసుకొచ్చిన నియంత్రిత పంటల సాగు విధానం రైతులకు ప్రయోజనం చేకూర్చకపోగా.. నష్టాలను తీసుకొచ్చింది. చెప్పిన పంటలు వేస్తేనే రైతు బంధు ఇస్తామని ప్రకటించడం కూడా రైతుల ఆగ్రహానికి కారణమైంది. ఈ ప్రయోగం బెడిసి కొట్టడంతో.. కేసీఆర్ వెనక్కి తగ్గారు. నియంత్రిత పంటలసాగును ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు.

    Also Read: ఆ సంప్రదాయానికి స్వస్తి చెప్పింది టీఆర్‌‌ఎసే కదా..!

    అంతేకాదు.. తెలంగాణలో తొలిసారిగా మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన సునీతా లక్ష్మారెడ్డి చైర్ పర్సన్‌గా నియమించారు. తెలంగాణలో ఇప్పటివరకూ మహిళా కమిషన్ ఏర్పాటుపై సర్కారు దృష్టి సారించకపోవడంపై విమర్శలొచ్చాయి. కానీ.. కేసీఆర్ మాత్రం వాటిని లైట్ తీసుకున్నారు. ఇక ఇప్పుడు.. బీజేపీ దూకుడు పెంచుతున్న వేళ.. నేతలు చేజారకుండా కేసీఆర్ సర్కారు నామినేటెడ్ పదవులను కట్టబెట్టే వ్యూహాన్ని అమలు చేస్తుందని భావిస్తున్నారు. అటు ప్రజాగ్రహాన్ని చల్లార్చడం.. ఇటు నేతలు చేజారకుండా చూడటం అనే వ్యూహంతో కేసీఆర్ ముందుకెళ్తున్నారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్