https://oktelugu.com/

ఆ సంప్రదాయానికి స్వస్తి చెప్పింది టీఆర్‌‌ఎసే కదా..!

ఇప్పటికే రాష్ట్రంలో టీఆర్‌‌ఎస్‌ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అటు దుబ్బాక.. ఇటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చావు దెబ్బతింది. ఇవి చాలవన్నట్లు ఆ పార్టీ నేత, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌‌ రెడ్డి గమ్మత్తైన వ్యాఖ్యలు చేశారు. ‘చనిపోయిన ప్రజాప్రతినిధుల కుటుంబాల్లోని వారికి ఉపఎన్నికల్లో ఏకగ్రీవం చేసే సంప్రదాయం ఉందని.. నాగార్జునసాగర్‌లోనూ విపక్షాలు అదే పాటించాలని’ అడుగుతున్నారు. ఎంత ఫన్నీగా ఉన్నాయి ఈ వ్యాఖ్యలు. మరి దుబ్బాకలో కూడా అక్కడి సిట్టింగ్‌ ఎమ్మెల్యే చనిపోతేనే కదా బై ఎలక్షన్స్‌ […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 28, 2020 5:27 pm
    Follow us on

    TRS party
    ఇప్పటికే రాష్ట్రంలో టీఆర్‌‌ఎస్‌ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అటు దుబ్బాక.. ఇటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చావు దెబ్బతింది. ఇవి చాలవన్నట్లు ఆ పార్టీ నేత, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌‌ రెడ్డి గమ్మత్తైన వ్యాఖ్యలు చేశారు. ‘చనిపోయిన ప్రజాప్రతినిధుల కుటుంబాల్లోని వారికి ఉపఎన్నికల్లో ఏకగ్రీవం చేసే సంప్రదాయం ఉందని.. నాగార్జునసాగర్‌లోనూ విపక్షాలు అదే పాటించాలని’ అడుగుతున్నారు. ఎంత ఫన్నీగా ఉన్నాయి ఈ వ్యాఖ్యలు. మరి దుబ్బాకలో కూడా అక్కడి సిట్టింగ్‌ ఎమ్మెల్యే చనిపోతేనే కదా బై ఎలక్షన్స్‌ వచ్చాయి. అక్కడ లేని సంప్రదాయం ఇక్కడ పాటించాలంటే మాట్లాడడం విడ్డూరంగా ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు.

    Also Read: తూచ్.. పాత సంప్రదాయం కొనసాగిద్దామంటున్న టీఆర్ఎస్..!

    నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చనిపోవడంతో ప్రస్తుతం అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఉపఎన్నిక కావడంతో టీఆర్ఎస్‌లో అప్పుడే ఆందోళన మొదలైంది. దీంతో.. నాగార్జునసాగర్‌ గండాన్ని ఎలా గట్టెక్కాలన్నదానిపై టీఆర్ఎస్ చర్చోపచర్చలు నిర్వహిస్తోంది. గాల్లో ఓ రాయి వేద్దామన్నట్లుగా ఏకగ్రీవం ప్రస్తావన కూడా తీసుకొచ్చింది. గుత్తా ప్రతిపాదనపై విపక్ష పార్టీల నేతలే సెటైర్లు వేస్తున్నారు. ఓ సారి వెక్కి తిరిగి చూసుకోమని సెటైర్లు వేస్తున్నారు.

    ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎవరైనా చనిపోతే.. వారి కుటుంబ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకునే సంప్రదాయం ఉంది. కానీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ దాన్ని పట్టించుకోలేదు. ఏనాడూ అమలు చేయలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చనిపోయినప్పుడు కనీసం సానుభూతి కూడా లేకుండా తెలంగాణ సెంటిమెంట్‌తో అభ్యర్థులను బరిలో దింపారు. పాలెరులో వెంకటరెడ్డి.. నారాయణఖేఢ్‌లో పటోళ్ల కృష్ణారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండేవారు. వారు చనిపోవడంతో ఉపఎన్నికలు వచ్చాయి. కానీ.. కేసీఆర్ ఈ ఏకగ్రీవ సంప్రదాయాన్ని పక్కన పెట్టేశారు. అంతేకాదు.. పెద్ద ఎత్తున పార్టీ బలగాలను మోహరించి విజయం సాధించారు. పాలేరులో తుమ్మలను గెలిపించారు. ఖేడ్‌లో భూపాల్ రెడ్డిని గెలిపించారు. సంప్రదాయాలను పాటించాలని అప్పట్లో విపక్ష నేతలు చెప్పినా లెక్క చేయలేదు.

    Also Read: అగ్రి చట్టాలపై కేసీఆర్‌‌ యూటర్న్

    ప్రస్తుతం టీఆర్‌‌ఎస్‌కు రాష్ట్రంలో గడ్డుకాలం నడుస్తోంది. బ్యాడ్‌ లక్‌తో సొంత పార్టీ ఎమ్మెల్యేలు చనిపోతున్నారు. దుబ్బాక లాంటి చోట్లోనే తెలంగాణ సెంటిమెంట్ పనిచేయలేదు. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరిగింది. అదే సమయంలో ఉపఎన్నికల్లో అధికార పార్టీ అడ్వాంటేజ్ పథకాలు కూడా పారడం లేదని.. గ్రేటర్ ఎన్నికల్లో తేలిపోయింది. మరోవైపు బీజేపీ రోజురోజుకూ స్ట్రాంగ్‌ అవుతోంది. ఉపఎన్నికల ద్వారా ఆ పార్టీకి మరింత అవకాశం కల్పిస్తున్నట్లుగా అవుతోంది. ఇప్పుడు.. తనకు అవసరం వచ్చింది కాబట్టి టీఆర్ఎస్ ఏకగ్రీవం సంప్రదాయాల్ని వెలుగులోకి తెస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్